పిఎంఇండియా

ప‌రిపాల‌న ప‌నితీరు

వెతుకు
 • బేటీ బచావ్, బేటీ పఢావ్: బాలికలకు రక్షణ

  బేటీ బచావ్, బేటీ పఢావ్: బాలికలకు రక్షణ

  కూతురు, కుమారుడు.. ఇద్దరికీ సమానంగా గౌరవించాలనేది మన నినాదం కావాలి. ఇకనుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే ఐదు మొక్కలు నాటి సంరం చేసుకోవాలి. కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలి. తను దత్తత తీసుకున్న జయపూర్ గ్రామస్తులనుద్దేశించి ప్రధాన మంత్రి మోదీ గారు ఈవిధంగా తెలిపారు. బేటీ బచావ్, బేటీ పఢావ్ (బీబీబీపీ) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు. సమాజంలో తగ్గుతున్న బాలికల సంఖ్య, మహిళా సాధికారతకు సంబంధించి జీవితచక్రంలో వస్తున్నమార్పులను పథకం పరిష్కరిస్తుంది. ఈ విభాగాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధిశాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి. పీసీ, పీఎన్‌డీటీ చట్టాన్ని అమలు చేయటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తొలి విడతలో దేశవ్యాప్తంగా తక్కువ బాలికల సంఖ్య ఉన్న వంద జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ, ...

 • జామ్ (జ‌న్ ధ‌న్‌, ఆధార్, మొబైల్‌) శ‌క్తిని సంపూర్ణంగా వినియోగించాలి.

  జామ్ (జ‌న్ ధ‌న్‌, ఆధార్, మొబైల్‌) శ‌క్తిని సంపూర్ణంగా వినియోగించాలి.

  భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌బోయే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు బ‌ల‌మైన పునాదిగా జామ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. నా దృష్టిలో జామ్ అంటే అధికంగా ల‌బ్ధి పొంద‌డం. ఖ‌ర్చు పెట్టిన ప్ర‌తి రూపాయి నుంచి ఎంత వీలైతే అంత విలువ‌ను పొంద‌డం. మ‌న పేద‌ల‌కు అధిక సాధికారిత‌ను సాధించ‌డం. సామాన్యుల చెంత‌కు అధికంగా సాంకేతిక‌త‌ను చేర‌వేయ‌డం. - ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశానికి స్వాతంత్ర్యంవ‌చ్చి 67 సంవ‌త్స‌రాలైన త‌ర్వాత కూడా భార‌త‌దేశంలో చాలా మంది ప్ర‌జ‌ల‌కు బ్యాంకు సేవ‌లు అందుబాటులో లేవు. దాంతో వారు త‌మ సంపాద‌న‌ నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోలేక‌పోతున్నారు. అంతే కాదు వారికి సంస్థాగ‌త రుణాల‌ను తీసుకునే అవ‌కాశం కూడా లేదు. ఈ ప్రాథమిక‌మైన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికిగాను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ 28 ఆగ‌స్టున ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌నను ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని ప్ర‌వేశ‌పెట్టిన కొద్ది నెల‌ల్లోనే ఈ ప‌థ‌కం అనేక మంది ప్ర‌జ‌ల జీవితాల్లో పెను మార్పులు తెచ్చి ...

 • అభివృద్ధికి కొత్త మార్గం: సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన

  అభివృద్ధికి కొత్త మార్గం: సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన

  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రారంభం సందర్భంగా ఈ పథకంపై తన ఆలోచనలను ఇలా పంచుకున్నారు. "అభివృద్ధిని చేరుకునేందుకు మనం అనుసరిస్తున్న విధానం సరఫరా ఆధారితమైనది. ఇది మన ప్రధాన సమస్యలలో ఒకటి. లక్నో, లేదా గాంధీనగర్ లేదా ఢిల్లీలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టామనుకోండి; అదే పథకాన్ని మిగిలిన చోట్ల కూడా అమలు చేయాలని చూస్తాం. ఇలాంటి సరఫరా ఆధారిత విధానాన్ని మేం పక్కన పెట్టి.. ఆదర్శ్ గ్రామ్ ద్వారా.. గిరాకీ (డిమాండ్) ఆధారిత విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నాం. అభివృద్ధికి ప్రేరణ గ్రామంలోనే ఏర్పడాలి. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటమే. మన ప్రజల మనసులను ఏకం చేయాలి. సాధారణంగా ఎంపీలు రాజకీయ కార్యక్రమాలలో మునిగి ఉంటారు. కానీ, దీని తరువాత వారు తమ గ్రామానికి చేరాక.. అక్కడ రాజకీయ కార్యకలాపాలేమీ ఉండవు. ఊరంతా ఓ కుటుంబంలా ఉంటుంది. గ్రామస్తులతో ...

 • భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తి వెలికితీత

  భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తి వెలికితీత

  "భారత్ లో ఎంతో గుప్తమైన ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉన్నదని నేను బలీయంగా విశ్వసిస్తున్నాను. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవలసి ఉంది. అలా చేస్తే మన దేశం ఉద్యోగాలను అర్థించే దేశంగా ఉండే కన్నా ఉద్యోగాలను కల్పించే దేశంగా మారుతుంది." - నరేంద్ర మోదీ దేశ యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికి తీయడంపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత్ లో ఎంటర్ ప్రిన్యూర్ షిప్ నకు ఉత్తేజం కల్పించేందుకు ఉద్దేశించిన 'మేక్ ఇన్ ఇండియా' నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. కొత్త ప్రాసెస్ లు: దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక ధోర‌ణుల‌ను ప్రోత్సహించడంలో అత్యంత ప్రధానమైన అంశం “వ్యాపారానుకూల వాతావరణ కల్పన” అని 'మేక్ ఇన్ ఇండియా' గుర్తించింది. నూతన మౌలిక వసతులు: పారిశ్రామిక రంగం వృద్ధికి ఆధునికమైన, అందరికీ ఉపయోగకరమైన మౌలిక ...

 • న‌మామీ గంగే

  న‌మామీ గంగే

  ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌లో 'గంగా న‌ది ఒడ్డున వెలసిన వార‌ణాసి నుంచి' పార్ల‌మెంటుకు ఎన్నిక‌య్యారు. ఎన్నిక త‌ర్వాత మే 2014లో ఆయ‌న మాట్లాడుతూ "గంగ‌మ్మ‌కు సేవ చేయ‌డం నా అదృష్టం" అని పేర్కొన్నారు. గంగాన‌ది ప్ర‌జలంద‌రికీ చాలా ముఖ్య‌మైన న‌ది. సాంస్కృతిక వైభ‌వం, ఆధ్యాత్మిక విశిష్ట‌త వ‌ల్ల‌నే అది ముఖ్య‌మైన‌ది అని అనుకోవ‌ద్దు.. గంగాన‌ది దేశ జనాభాలో న‌ల‌భై శాతం మంది ప్ర‌జ‌ల‌కు జీవ‌నాధారం. 2014లో అమెరికాలోని మేడిస‌న్ స్వేర్ నుంచి అక్క‌డి భార‌త క‌మ్యూనిటీని ఉద్దేశించి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ, గంగాన‌ది గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. మ‌నం గంగాన‌దిని శుభ్ర‌ప‌రిచే కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయ‌గ‌లిగామంటే అది దేశంలోని న‌ల‌భైశాతం మంది ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసిన‌ట్టే. కాబ‌ట్టి గంగాన‌దిని శుభ్ర‌ప‌రిచే కార్య‌క్ర‌మం కూడా ఒక ఆర్థిక ఎజెండాగానే భావించాలంటూ ఆ రోజున‌ ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాని ఆశ‌యాన్ని సాకారం చేయ‌డానికి ప్ర‌భుత్వం న‌మామి ...

 • భార‌త‌దేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు

  భార‌త‌దేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు

  భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఏడు ద‌శాబ్దాలు కావొస్తున్నా ఇప్ప‌టికీ దేశంలో 18,000 గ్రామాల‌కు విద్యుత్ శ‌క్తి అంద‌డం లేదు. ఈ 18,000 గ్రామాల‌కు విద్యుత్ ను అందించాల‌నే బృహ‌త్త‌ర‌మైన ల‌క్ష్యాన్ని భార‌త‌దేశం నిర్దేశించుకున్న‌ది. దేశంలో క‌రెంటు లేని గ్రామాల‌న్నిటికీ రాబోయే వేయి రోజుల్లో క‌రెంటు అంద‌జేస్తామ‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌న స్వాతంత్ర్య దినోత్స‌వ ప్ర‌సంగంలో స్ప‌ష్టం చేశారు. దేశంలో గ్రామీణ విద్యుదీక‌ర‌ణ చాలా వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మం ఎన్న‌డూ లేనంత‌గా పార‌దర్శ‌క‌మైన ప‌ద్ధ‌తిలో జ‌రుగుతోంది. ఏ ఏ గ్రామాల‌కు విద్యుత్ సౌక‌ర్యాన్ని అందివ్వాల్సి ఉందో ఆ గ్రామాల వివ‌రాల‌ను మొబైల్ యాప్ , వెబ్ డ్యాష్ బోర్డు ద్వారా తెలుసుకోవ‌చ్చు. క‌రెంటు లేని గ్రామాల‌కు క‌రెంటు సౌక‌ర్యం క‌ల్పించగానే ఆ ప‌ల్లెల్ని విద్యుత్ పొందుతున్న ప‌ల్లెలుగానే చూడ‌కూడ‌దు. క‌రెంటు సౌక‌ర్యం క‌ల్పించ‌డ‌మ‌నేది అంత‌కంటే ఎక్కువ‌. క‌రెంటు సౌక‌ర్యాన్ని క‌లిగిన గ్రామాల ప్ర‌జ‌ల‌ క‌ల‌లు, ఆకాంక్ష‌లు, జీవితంలో ...

 • భార‌త‌దేశ ఆర్థికరంగ అభివృద్ధిప‌థంలో వ‌డివ‌డిగా అడుగులు

  భార‌త‌దేశ ఆర్థికరంగ అభివృద్ధిప‌థంలో వ‌డివ‌డిగా అడుగులు

  ఎన్ డీ ఏ ప్ర‌భుత్వం పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత భార‌త‌దేశం అత్యంత‌ వేగంగా వృద్ధి సాధిస్తున్న భారీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గ‌ల దేశంగా గుర్తింపు పొందిందింది. గ‌డిచిన సంవ‌త్స‌రం భార‌త‌దేశ ఆర్థిక‌రంగంలో చరిత్రాత్మ‌క సంవ‌త్స‌రంగా మిగిలిపోయింది. ఎన్ డీ ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో త‌క్కువ వృద్ధి, అధిక ద్ర‌వ్యోల్బ‌ణం, ఉత్ప‌త్తుల్లో భారీగా త‌గ్గుద‌ల ఉండేవి. ఆ ప‌రిస్థితి నుంచి బైట‌ప‌డ‌డానికి కేంద్రం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. స్థూల ఆర్థిక ప్రాథ‌మిక అంశాలను బ‌లోపేతం చేసింది. అంతే కాదు, ఆర్థిక రంగాన్ని అధిక వృద్ధి ప‌థంలోకి నడిపించింది. భార‌త‌దేశ జీడీపీ వృద్ధి 7.4 శాతానికి ఎగ‌బాకింది. ప్ర‌పంచంలోని భారీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లను క‌లిగిన దేశాల‌ను తీసుకుంటే ఇది అత్యంత వేగ‌వంత‌మైన పెరుగుద‌ల‌. ఎన్ డీ ఏ ప్ర‌భుత్వ పాల‌న కింద రానున్న కొద్ది సంవ‌త్స‌రాల్లో భార‌త‌దేశ వృద్ధి గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి సాధిస్తుంద‌ని ప‌లు రేటింగు ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు, ...

 • భాగ్యవంతమైన భారతం కోసం రైతులకు సాధికారత

  భాగ్యవంతమైన భారతం కోసం రైతులకు సాధికారత

  వ్యవసాయానికి ఊతమందించేందుకు తీసుకున్న పలు చర్యలు దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీయే ప్రభుత్వం నవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండే ప్రతి ఎకరాకూ నీరు అందాలి.. నీటి పారుదల వ్యవస్థ మెరుగవ్వాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ‘ప్రతి చుక్కకు మరింత పంట’ (పర్ డ్రాప్ మోర్ క్రాప్) నినాదంతో.. రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్య పరచటం చేస్తున్నారు. అన్నదాతలకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణనిచ్చి వారిని చైతన్య పరిచేందుకు పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్నిప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డులను ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో ఈ ...

 • మునుపెన్న‌డూ లేని పార‌ద‌ర్శ‌క‌త

  మునుపెన్న‌డూ లేని పార‌ద‌ర్శ‌క‌త

  పార‌ద‌ర్శ‌క, అవినీతి ర‌హిత ప్ర‌భుత్వంతో, పాల‌న‌తో దేశానికి చేకూరే ప్ర‌యోజ‌నాలు అపారం. గ‌త ద‌శాబ్ద‌మంతా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు, అవినీతి, విధాన ప‌ర‌నిర్ణ‌యాల స్థానంలో వ్య‌క్తిగ‌త విచ‌క్ష‌ణ నిర్ణ‌యాల మ‌యంగా మారిన క‌థ‌ల్ని చూశాం. కానీ గ‌త ఏడాదికాలంగా మంచి దిశ‌గా మార్పును చూస్తున్నాం. సుప్రీంకోర్టు కోల్‌బ్లాక్‌ల కేటాయింపుల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత ఈ ప్ర‌భుత్వం మునుపెన్న‌డూ లేనంత పార‌ద‌ర్శ‌క‌త, స‌త్వ‌ర నిర్ణ‌యాలకు పెద్ద‌పీట వేసింది. ఫ‌లితంగా 67 కోల్‌బ్లాక్‌ల కేటాయింపు వేలంపాటల ద్వారా సుమారు 3.35 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరాయి. *వేలంపాట ప్ర‌క్రియ సజావుగా సాగింది. ఈ ప్ర‌క్రియ‌లో మాకెలాంటి వివ‌క్ష‌గానీ, అహేతుకత‌గానీ క‌న్పించ‌టం లేదు. అంతేగాకుండా ఎవరో ఒక‌రికి లాభంమునుపెన్న‌డూ లేని పార‌ద‌ర్శ‌క‌త పార‌ద‌ర్శ‌క, అవినీతి ర‌హిత ప్ర‌భుత్వంతో, పాల‌న‌తో దేశానికి చేకూరే ప్ర‌యోజ‌నాలు అపారం. గ‌త ద‌శాబ్ద‌మంతా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు, అవినీతి, విధాన ప‌ర‌నిర్ణ‌యాల స్థానంలో వ్య‌క్తిగ‌త విచ‌క్ష‌ణ నిర్ణ‌యాల మ‌యంగా మారిన క‌థ‌ల్ని ...

 • ఉజ్జ్వల‌మైన భ‌విష్య‌త్ దిశ‌గా అడుగులు

  ఉజ్జ్వల‌మైన భ‌విష్య‌త్ దిశ‌గా అడుగులు

  విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్ డీ ఏ ప్ర‌భుత్వం చేప‌ట్టిన బృహ‌త్త‌ర‌మైన‌ కార్యక్ర‌మాలు. విద్యారంగంలో నాణ్య‌త‌ను పెంచ‌డానికి, అంద‌రికీ అందుబాటులోకి తేవ‌డానికి ఎన్ డీ ఏ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. ప్ర‌ధాన‌ మంత్రి విద్యాలక్ష్మి కార్య‌క్ర‌మం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాల, ఉపకార వేతనాల నిర్వ‌హ‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌ కోసం ఒక పూర్తి స్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక స‌హాయ అధికార సంస్థ ప‌ని చేస్తుంది. ఉపాధ్యాయుల శిక్ష‌ణ‌ కార్య‌క్ర‌మాల‌ ద్వారా విద్య‌లో నాణ్య‌త పెంచ‌డానికిగాను పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ మిష‌న్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది. అంత‌ర్జాతీయ‌ స్థాయి గురువులు భార‌తీయ విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌డానికి వీలుగా గ్లోబ‌ల్ ఇనీషియేటివ్ అకాడ‌మిక్ నెట్‌వ‌ర్క్‌ (జిఐఏ ఎన్.. గ్యాన్‌) ను ప్రారంభించడం జ‌రిగింది. దీని ద్వారా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన అధ్యాప‌కుల‌ను, శాస్త్రవేత్తలను, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆహ్వానించి వారితో వేస‌వి, శీతాకాల స‌మ‌యాల్లో ...

 • లోడ్ అవుతోంది...