పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

ఇండియా-ఇయు సమిట్ (అక్టోబర్ 6, 2017) సందర్భంగా ప్రధాన మంత్రి యొక్క ఆంగ్ల పత్రికా ప్రకటన పాఠం

ఇండియా-ఇయు సమిట్ (అక్టోబర్ 6, 2017) సందర్భంగా ప్రధాన మంత్రి యొక్క ఆంగ్ల పత్రికా ప్రకటన పాఠం

ఇండియా-ఇయు సమిట్ (అక్టోబర్ 6, 2017) సందర్భంగా ప్రధాన మంత్రి యొక్క ఆంగ్ల పత్రికా ప్రకటన పాఠం

ఇండియా-ఇయు సమిట్ (అక్టోబర్ 6, 2017) సందర్భంగా ప్రధాన మంత్రి యొక్క ఆంగ్ల పత్రికా ప్రకటన పాఠం

శ్రేష్ఠులైన అధ్యక్షులు శ్రీ టస్క్ మరియు శ్రీ జంకర్,

మాననీయ ప్రతినిధులారా,

ప్రసార మాధ్యమాల సభ్యులారా,

అధ్యక్షులు శ్రీ టస్క్ మరియు అధ్యక్షులు శ్రీ జంకర్ లు 14వ ఇండియా-ఇయు సమిట్ లో పాల్గొనవలసిందిగా స్వాగతం పలికే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను.

ఇయు తో బహుముఖీన భాగస్వామ్యానికి భారతదేశం విలువనిస్తున్నది. అంతేకాక, మేం మా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అధిక ప్రాముఖ్యాన్ని కట్టబెడుతున్నాం. యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ తో 1962లో దౌత్య సంబంధాలను నెలకొల్పుకొన్న మొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.

యూరోపియన్ యూనియన్ చాలా కాలం నుండి మా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఇయు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరంగా మా అతి పెద్ద వనరులలో ఒకటిగా కూడా ఉంటోంది.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మనం సహజ భాగస్వాములుగా ఉంటున్నాం. ప్రజాస్వామ్యం, చట్ట నియమావళి, ప్రాథమిక స్వేచ్ఛలు మరియు భిన్న సంస్కృతుల విషయంలో సమష్టి విలువలే పునాదులుగా మన మధ్య సన్నిహిత సంబంధాలు నిర్మితమయ్యాయి.

మనం బహుళధ్రువ, నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమానుగత వ్యవస్థ విషయంలోనూ ఒకే దార్శనికతను కలిగివుంటున్నాము. గత సంవత్సరంలో 13వ సమిట్ బ్రసెల్స్ లో జరిగిన నాటి నుండి మన మధ్య సంబంధాలు స్థిరమైన వేగాన్ని పుంజుకొన్నాయి. కొన్ని రోజుల క్రితం అధ్యక్షులు శ్రీ జంకర్ చెప్పిన మాటలలోనే, ఇండియా- యూరోపియన్ యూనియన్ సంబంధాలు ప్రస్తుతం బహు సానుకూలంగా ఉన్నాయి.

మిత్రులారా,

ఈ రోజు పలు అంశాలతో కూడిన కార్యావళిపై మనం ఫలప్రద చర్చలను సాగించినందుకుగాను నేను అధ్యక్షులు శ్రీ టస్క్ మరియు అధ్యక్షులు శ్రీ జంకర్ లకు హార్దిక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

ఇండియా- ఇయు అనుబంధాన్ని మనం అనేక నూతన రంగాలకు విస్తరించుకొన్నాము. అంతే కాకుండా, ఈ అనుబంధాన్ని పరస్పర విశ్వాసం మరియు అవగాహనల ప్రాతిపదికన మరింత సమగ్రమైందిగాను, పరస్పర ప్రయోజనకరమైందిగాను తీర్చిదిద్దేందుకు మన ప్రయత్నాలను తప్పక కొనసాగించాలని కూడా అంగీకరించాము.

మన కడపటి శిఖర సమ్మేళనంలో తీసుకొన్న నిర్ణయాల అమలులోను మరియు గత సంవత్సరంలో ప్రకటించినటువంటి అజెండా 2020 కి సంబంధించినటువంటి పురోగతిని ఇవాళ మనం సమీక్షించాము.

మనం మన భద్రత సంబంధ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసి పనిచేయాలని అంగీకరించాము. మనం ఈ అంశంపై మన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టపరచుకొంటాం. అలాగే, బహుళపక్ష వేదికలలో మన సహకారాన్ని, సమన్వయాన్ని కూడా పెంపొందించుకొంటాము.

పరిశుభ్రమైనటువంటి శక్తి, ఇంకా జల వాయు పరివర్తన అంశాలకు వస్తే, మనం 2015 ప్యారిస్ అగ్రిమెంట్ కు కట్టుబడి ఉన్నాము. జల వాయు పరివర్తన సమస్యను పరిష్కరించడం సురక్షితమైన, భరించగల ఖర్చుతో కూడిన మరియు స్థిర సరఫరాలు ఉండేటటువంటి శక్తిని ఉత్పత్తి చేసుకొంటూ ఉండటం మన ఉమ్మడి ప్రాథమ్యాలు. నవీకరణ యోగ్య శక్తి ని జనింపచేసేందుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం పరస్పర సహకారాన్ని అందజేసుకోవాలన్న మన వచనబద్ధతను సైతం మనం పునరుద్ఘాటించాము.

స్మార్ట్ సిటీస్ ను అభివృద్ధిపరచడంలోను మరియు పట్టణ ప్రాంతాలలో అవస్థాపన స్థాయిని పెంచడంలోను యూరోపియన్ యూనియన్ తో మన సహకారాన్ని మనం బలపరచుకొందాం.

ఇండియా- ఇయు హోరిజోంటల్ సివిల్ ఏవియేషన్ అగ్రిమెంట్ ఇప్పుడిక అమలులోకి వచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను. ఇది మన మధ్య గగన తల అనుసంధానాన్ని ఇనుమడింపచేయగలదన్న విశ్వాసమూ, ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలను వర్ధిల్ల జేయగలదన్న విశ్వాసమూ నాలో ఉన్నాయి.

శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం మరియు పరిశోధన, ఇంకా నూతన ఆవిష్కరణల రంగంలో మన సహకారం అనేది మన సంబంధాలలోని మరొక ముఖ్యమైన అంశం. ఈ సందర్భంగా, మన యువ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల రాకపోకలపై ఈ రోజు కుదిరినటువంటి ఒప్పందాన్ని నేను స్వాగతిస్తున్నాను.

భారతదేశంలోని అభివృద్ధి పథకాలకు యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకు తో కుదిరిన రుణాల ఒప్పందాలు కూడా స్వాగతించదగ్గ మరొక పరిణామం.

ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ లోని సభ్యత్వ దేశాలలో సౌర సంబంధ పథకాలకు నిధులు అందించేందుకు ముందుకు వస్తూ యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకు తీసుకొన్న నిర్ణయాన్ని కూడా నేను అభినందిస్తున్నాను.

మా వ్యాపారం మరియు పెట్టుబడి ప్రవాహాలను పటిష్టపరచుకోవడంలో మన సహకారాన్ని ఇంకా విస్తరించుకొనేటందుకు ఇయుతో కలసి పనిచేయడానికి మేం దీక్షాబద్ధులం అయి ఉన్నాము.

శ్రేష్ఠులారా,

మీ నాయకత్వానికి మరియు ఇండియా- ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడానికి మీరు అందిస్తున్నటువంటి తోడ్పాటుకు గాను మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ భారతదేశ భావి పర్యటన ఇంత సంక్షిప్తంగా ఉండబోదనే నా ఆశా, ఆకాంక్షానూ.

ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

 

***