పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎర్ర‌కోట‌ స‌మీపంలోని మాధ‌వ్ దాస్ పార్క్ లో ద‌స‌రా ఉత్స‌వాల్లో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి, జాతికి సానుకూల స‌హ‌కార‌ “సంక‌ల్పం” తీసుకునేందుకు ప్రోత్సాహం

ఢిల్లీలోని ఎర్ర‌కోట ద‌గ్గ‌ర‌లోని మాధ‌వ్ దాస్ పార్కులో జ‌రిగిన ద‌స‌రా మ‌హోత్స‌వాల్లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పాల్గొన్నారు.

2022 సంవ‌త్స‌రంలో దేశం 75వ స్వాతంత్ర దినోత్స‌వం జ‌రుపుకునే స‌మ‌యానికి జాతికి త‌మ వంతు సానుకూల స‌హ‌కారం అందించాల‌న్న సంక‌ల్పం తీసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తీ ఒక్క‌రికీ విజ్ఞ‌ప్తి చేశారు.

“భార‌తీయ ప‌ర్వ‌దినాలు కేవ‌లం వేడుక‌గా జ‌రుపుకునే సంఘ‌ట‌న‌లు మాత్ర‌మే కాదు, స‌మాజాన్ని చైత‌న్య‌వంతం చేసే మాధ్య‌మాలు. సామాజిక విలువ‌ల గురించి పండుగ‌లు మ‌న‌కి తెలియ‌చేస్తాయి. అంద‌రూ ఒక్క‌టిగా సామాజిక జీవ‌నం గ‌డ‌ప‌డం గురించి బోధిస్తాయి” అని ప్ర‌ధాన‌మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

మ‌న సంఘ‌టిత శ‌క్తికి, సామాజిక‌, సాంస్కృతిక విలువ‌ల‌కు, ఎంతో విలువైన సాంస్కృతిక సాంప్ర‌దాయాల‌కు పండుగ‌లు ద‌ర్ప‌ణం ప‌డ‌తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. పండుగ‌ల‌కు వ్య‌వ‌సాయం, న‌దులు, ప‌ర్వ‌తాలు,ప్ర‌కృతికి ఎంతో సాన్నిహిత్యం ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భంగా రావ‌ణ‌, కుంభ‌క‌ర్ణ‌, మేఘ‌నాథుల దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నాన్ని ఆయ‌న వీక్షించారు.