పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

ఐసిఎస్ఐ స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌ర ప్రారంభ కార్య‌క్ర‌మంలో కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

ఐసిఎస్ఐ స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌ర ప్రారంభ కార్య‌క్ర‌మంలో కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

ఐసిఎస్ఐ స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌ర ప్రారంభ కార్య‌క్ర‌మంలో కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

ఐసిఎస్ఐ స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌ర ప్రారంభ కార్య‌క్ర‌మంలో కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌రం ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొని, కంపెనీ సెక్ర‌ట‌రీ ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఐసిఎస్ఐ తో సంబంధం ఉన్న అంద‌రినీ ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు. కంపెనీలు చ‌ట్టాన్ని అనుస‌రిస్తూ వాటి ఖాతాల‌ను త‌గిన విధంగా నిర్వ‌హించేట‌ట్లుగా పాటు ప‌డుతున్న వారంద‌రి మ‌ధ్య‌కు రావ‌డం త‌న‌కు సంతోషాన్ని ఇస్తోంద‌ని ఆయ‌న అన్నారు. దేశం యొక్క కార్పొరేట్ సంస్కృతికి ఒక రూపును ఏర్పరచ‌డంలో వారి కృషి సహాయపడుతోంద‌ని ఆయ‌న చెప్పారు. వారి స‌ల‌హాలు దేశం యొక్క కార్పొరేట్ పాల‌న‌ను ప్రభావితం చేస్తున్నట్లు కూడా ఆయ‌న వివ‌రించారు.

మ‌న స‌మాజ వ్య‌వ‌స్థ‌ల యొక్క నిజాయతీని బ‌ల‌హీనప‌ర‌చాల‌న్న ప్రయత్నాలు మ‌రియు దేశ గౌర‌వాన్ని న్యూనీక‌రించాల‌న్న ప్ర‌య‌త్నాలు చేస్తున్న కొంత మంది మ‌న దేశంలో ఉన్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అటువంటి శ‌క్తుల బారి నుండి వ్య‌వ‌స్థ‌ను శుద్ధిప‌రచే దిశ‌గా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌భుత్వం కృషి ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ త‌క్కువ న‌గ‌దుతో న‌డుస్తోందని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. నోట్ల చ‌ట్ట‌బ‌ద్ధ‌త ర‌ద్దుకు ముందు Cash to GDP Ratio 12 శాతం ఉండ‌గా, ప్ర‌స్తుతం 9 శాతానికి దిగి వ‌చ్చింది. నిరాశావాదాన్ని వ్యాపింప చేయాల‌ని కోరుకొంటున్న ప్ర‌జ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. గ‌డ‌చిన త్రైమాసికంలో న‌మోదైన 5.7 శాతం వృద్ధి రేటు క‌న్నా త‌క్కువ వృద్ధి రేటు న‌మోదైన సంద‌ర్భాలు గ‌తంలో ఉన్న సంగతిని ఆయ‌న గుర్తు చేశారు. ఆయా సంద‌ర్భాల‌లో త‌క్కువ వృద్ధి రేటుల‌కు తోడు అధిక ద్ర‌వ్యోల్బ‌ణం, అధిక క‌రెంట్ ఖాతా లోటు మ‌రియు అధిక కోశ లోటు కూడా న‌మోదైన‌ట్లు ఆయ‌న చెప్పారు.

గ్లోబ‌ల్ రిక‌వ‌రీ ప్ర‌క్రియ‌ను వెనుక‌కు లాగుతూ ఉండిన ఫ్రెజైల్ ఫైవ్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో భార‌త‌దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక‌టిగా ప‌రిగ‌ణించిన కాలం కూడా ఉండింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కింద‌టి త్రైమాసికంలో వృద్ధిలో క్షీణ‌త ఉన్న విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి అంగీక‌రిస్తూ, ఈ స‌ర‌ళిని తిరిగి మార్చ‌డం కోసం ప్ర‌భుత్వం కంక‌ణ బ‌ద్ధురాలైనట్లు చెప్పారు. సంస్క‌ర‌ణ సంబంధిత ముఖ్య నిర్ణ‌యాల‌ను అనేకం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్థిర‌త్వాన్ని కాపాడటం జ‌రుగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు దేశాన్ని రానున్న సంవ‌త్స‌రాల‌లో అభివృద్ధిప‌రంగా ఒక కొత్త కూట‌మి లోకి చేర్చుటతాయంటూ స‌భికుల‌కు ఆయ‌న హామీ ఇచ్చారు. నిజాయతీకి బ‌హుమానాన్ని ఇవ్వ‌డంతో పాటు నిజాయతీ తాలూకు ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించడం జరుగుతుందని ఆయ‌న చెప్పారు.

గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో కొన్ని కీల‌క రంగాల‌లో పెట్టుబ‌డి మ‌రియు వ్య‌యాలు పెద్ద ఎత్తున పెరిగిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి చెప్పుకొచ్చారు. ఆ కాలంలో 21 రంగాల‌లో 87 సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. పెట్టుబ‌డిలో ప‌రిమాణాత్మ‌క వృద్ధిని క‌ళ్ళ‌కు క‌ట్టే సంఖ్య‌ల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

ప్ర‌భుత్వ విధాన రూప‌క‌ల్ప‌న మ‌రియు ప్ర‌ణాళికా ర‌చ‌న‌లో పేద‌లు మ‌రియు మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు లాభం చేకూరే విధంగాను, వారి జీవితాలు మెరుగైన మార్పున‌కు లోన‌య్యే విధంగాను శ్ర‌ద్ధ వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

దేశాన్ని మ‌రియు దేశ ప్ర‌జ‌ల‌ను శక్తిమంతం చేయ‌డానికి ప‌ని చేస్తున్న తాను- కొన్ని కొన్ని సంద‌ర్భాల‌లో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తున్న‌ప్ప‌టికీ- త‌న యొక్క స్వీయ వ‌ర్త‌మానం కోస‌మ‌ని దేశం యొక్క భ‌విష్య‌త్తును త‌న‌ఖా పెట్ట‌జాల‌న‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

*****

ఐసిఎస్ఐ స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌రం ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ద‌ర్శించిన ప్ర‌జెంటేష‌న్‌