పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫీఫా అండ‌ర్ – 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాలు పంచుకొంటున్న అన్ని జ‌ట్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి

ఫీఫా అండ‌ర్ – 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాలు పంచుకొంటున్న జ‌ట్లు అన్నింటికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వాగ‌తం ప‌లికారు. ఆయా జ‌ట్ల‌కు ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘ఫీఫా అండర్ – 17 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగం పంచుకొంటున్న అన్ని జ‌ట్ల‌కు సాద‌ర స్వాగ‌తం మ‌రియు శుభాకాంక్ష‌లు. ఫీఫా అండ‌ర్ – 17 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుట్ బాల్ ప్రియుల‌కు క‌నువిందు క‌లిగిస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***