పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగ‌ళూరు లో ద‌శ‌మ‌: సౌంద‌ర్య ల‌హ‌రీ పారాయ‌ణోత్స‌వ మ‌హాస‌మ‌ర్ప‌ణె కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు బెంగ‌ళూరు లో నిర్వ‌హించిన ద‌శ‌మ‌: సౌంద‌ర్య ల‌హ‌రీ పారాయ‌ణోత్స‌వ మ‌హాస‌మ‌ర్ప‌ణె కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఆది శంక‌రాచార్యుల వారు ర‌చించిన శ్లోకాల గుచ్ఛమే సౌంద‌ర్య ల‌హ‌రి. ఈ కార్య‌క్ర‌మంలో సౌంద‌ర్య ల‌హ‌రి ని సామూహికంగా పారాయ‌ణం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ సామూహిక పారాయ‌ణం ద్వారా ఇక్కడి పర్యావరణంలో ఒక ప్ర‌త్యేక శ‌క్తి వ్యాపించిన అనుభూతి తనకు కలిగిందన్నారు.

కొద్ది రోజుల కింద‌ట కేదార్‌నాథ్ ను తాను సంద‌ర్శించిన సంగ‌తిని ఆయ‌న గుర్తుకు తెచ్చుకొంటూ, ఆ సుదూర ప్రాంతంలోనూ, అలాగే భార‌త‌దేశం లోని ఇత‌ర ప్రాంతాల‌ లోనూ ఆది శంక‌రుల వారు సాపేక్షంగా ఆయన జీవించింది స్వ‌ల్ప కాలమే అయినప్పటికీ చేసినటువంటి కృషి త‌న‌ను విస్మ‌యానికి లోనుచేసింద‌న్నారు. వేదాలు మ‌రియు ఉప‌నిష‌త్తుల ద్వారా ఆది శంక‌రుల వారు భార‌త‌దేశాన్ని ఏకం చేశార‌ని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఆది శంకరుల వారి ర‌చ‌న అయిన సౌంద‌ర్య ల‌హ‌రి తో సామాన్య మాన‌వుడు మ‌మేకం కాగ‌ల‌గుతాడు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆది శంక‌రాచార్య స‌మాజంలోని పాపాల‌ను నిర్మూలించడంతో పాటు, అవి భావి త‌రాల‌కు వ్యాప్తి చెంద‌కుండా నివారించార‌ని ఆయ‌న తెలిపారు. విభిన్న సిద్ధాంతాలలోని, విభిన్న ఆలోచ‌నా స్ర‌వంతుల లోని ఉత్త‌మమైన అభ్యాసాల‌ను ఆది శంక‌రులు ఆక‌ళింపు చేసుకొన్నార‌ని ఆయ‌న చెప్పారు. అంద‌రినీ ఇముడ్చుకోవ‌డంతో పాటు స‌మ‌ష్టిగా ముందుకు సాగే భార‌తీయ సంస్కృతి యొక్క ప్ర‌స్తుత రూపంలో ఆది శంక‌రాచార్య చేసిన‌టువంటి త‌ప‌స్సు ఇప్ప‌టికీ కొన‌సాగుతూనేవుంది అని ఆయ‌న అన్నారు. ఈ సంస్కృతి ‘న్యూ ఇండియా’ కు పునాది అని, అంతే కాకుండా దీనిని ‘స‌బ్‌కా సాత్- స‌బ్‌కా వికాస్’ మంత్రం కూడా అనుస‌రిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఒక ర‌కంగా చూస్తే భార‌త‌దేశ సాంస్కృతిక వార‌స‌త్వం ప్ర‌పంచం లోని అన్ని స‌మ‌స్య‌ల‌కూ స‌మాధానాలను అందించ‌గ‌లిగేదే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌కృతిని దోచుకోవ‌డాన్ని నిరోధించ‌డానికి భార‌తదేశం స‌దా ప్రాధాన్యాన్నిస్తూ వ‌స్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇంత‌కు ముందు 350 రూపాయ‌ల క‌న్నా ఎక్కువ ధ‌ర‌ కలిగిన ఎల్ఇడి బ‌ల్బులు ప్ర‌స్తుతం ఉజాలా ప‌థ‌కంలో భాగంగా 40 రూపాయ‌ల నుండి 45 రూపాయ‌ల ధ‌ర‌కు ల‌భ్యం అవుతున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఇంత వ‌ర‌కు 27 కోట్ల‌కు పైగా ఎల్ఇడి బ‌ల్బుల‌ను పంపిణీ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇది ఎల‌క్ట్రిసిటీ బిల్లు లోనూ ఆదాకు కారణమైన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

ఉజ్జ్వ‌ల యోజ‌న ద్వారా 3 కోట్ల‌కు పైగా ఎల్‌పిజి క‌నెక్ష‌న్ ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మ‌హిళ‌ల జీవితాల‌లో ఒక స‌కారాత్మ‌క‌మైన వ్యత్యాసాన్ని తీసుకు రావ‌డంతో పాటు, శుద్ధ ప‌ర్యావ‌ర‌ణానికి కూడా తన వంతు తోడ్పాటును అందించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

నిర‌క్ష‌రాస్య‌త‌, అజ్ఞానం, పోష‌కాహార లోపం, న‌ల్ల‌ధ‌నం మ‌రియు అవినీతి ల వంటి పాపాల‌ బారి నుండి భార‌త‌దేశాన్ని విముక్తం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం ప్ర‌స్తుత త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.