పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లోని శహన్ శాహ్ పుర్ లో స్వచ్ఛత శ్రమదానంలో పాల్గొన్న ప్రధాన మంత్రి; పశుధన్ ఆరోగ్య మేళా సందర్శన; సభికులను ఉద్దేశించి ప్రసంగం

వారాణసీ లోని శహన్ శాహ్ పుర్ గ్రామంలో ఒక మరుగుదొడ్డి నిర్మాణంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాలుపంచుకొని శ్రమదానం చేశారు. మా గ్రామాన్ని బహిరంగ మల మూత్రాదులకు దూరంగా ఉంచుతాం అంటూ తీర్మానించుకొన్న గ్రామీణులతో ఆయన ముచ్చటించారు. మరుగుదొడ్డికి ‘‘ఇజ్జత్ ఘర్’’ అని పేరు పెట్టిన ఆ గ్రామస్థుల చొరవను ఆయన అభినందించారు.

గ్రామంలో నిర్వహించిన పశుధన్ ఆరోగ్య మేళా ను ప్రధాన మంత్రి సందర్శించారు. మేళా ఆవరణలో చేపడుతున్న వేరువేరు ఆరోగ్య మరియు వైద్య కార్యక్రమాలను గురించి సంబంధిత అధికారులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువ‌చ్చారు. పశువులకు శస్త్రచికిత్సలు, అల్ట్రాసొనోగ్రఫి ల వంటివి ఆ కార్యక్రమాలలో భాగంగా ఉన్నాయి.

ఈ సందర్భంగా ఒక పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పశుధన్ ఆరోగ్య మేళా ను విజయవంతంగా ఏర్పాటు చేసినందుకుగాను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఇది ఒక కొత్త ప్రయత్నం, ఇది రాష్ట్రంలో పశుపోషణకు ప్రయోజనకారి కాగలదు అని ఆయన అన్నారు. పాల ఉత్పత్తిలో పెరుగుదల ప్రజలకు ఆర్థికంగా మేలు చేస్తుందని ఆయన చెప్పారు. పాడి రంగంలో లాభాలు ఏకీకృత‌ం కావడంలో సహకార సంఘాలు తోడ్పడతాయని ఆయన అన్నారు.

ప్రజల శ్రేయస్సే పాలన పరమార్ధం కావాలని ప్రధాన మంత్రి పేర్కొంటూ, 2022 కల్లా వ్యవసాయ ఆదాయాలను రెండింతలు చేయాలన్న ప్రతిజ్ఞ‌ను పునరుద్ఘాటించారు. భూమి స్వస్థత కార్డులు వ్యవసాయదారులకు చెప్పుకోదగ్గ లాభాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు. 2022కల్లా మన స్వాతంత్ర్య యోధులు కలలుగన్న భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం సకారాత్మకమైనటువంటి కృషిని అందిస్తామంటూ మనలో ప్రతి ఒక్కరం సంకల్పం చెప్పుకొందామని ఆయన సూచించారు.

పరిశుభ్రతను మన బాధ్యతగా మనం భావించాలి, ఈ భావనను అందరిలోనూ నాటుకొనేలా చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది సౌష్టవానికి పూచీపడుతుందని, ఇంకా పేదల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గొప్ప పాత్రను పోషిస్తుందని ఆయన చెప్పారు. స్వచ్ఛత అంటే అది ఒక పూజ లాగానూ, పరిశుభ్రత అంటే పేదలకు సేవ చేసేందుకు ఒక మార్గం వంటిదిగానూ తనకు తోస్తుంది అని ప్రధాన మంత్రి వివరించారు.

***