పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ కుందన్ శాహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ కుందన్ శాహ్ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

‘‘శ్రీ కుందన్ శాహ్ మరణం వ్యథను కలిగించింది. సామాన్య పౌరుల జీవనం, వారి సంఘర్షణల చిత్రణలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని మేళవించిన తీరుకుగాను ఆయన చిరస్మరణీయులవుతారు. ఆయన కుటుంబ సభ్యుల, ఆయన ప్రశంసకుల శోకంలో నేనూ పాలు పంచుకొంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి లభించు గాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***