పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాన మంత్రి, బిలాస్‌పుర్ లో ఎఐఐఎమ్ఎస్ కు శంకు స్థాప‌న‌

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని బిలాస్‌పుర్ లో ఈ రోజు ప‌ర్య‌టించారు.

బిలాస్‌పుర్ లో అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్)కు ప్ర‌ధాన మంత్రి పునాదిరాయి వేశారు. 750 ప‌డ‌క‌లు ఉండే ఈ ఆస్ప‌త్రిని సుమారు రూ.1350 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తారు. ఇక్కడ ఆరోగ్య సంర‌క్ష‌ణతో పాటు అండ‌ర్ గ్రాడ్యుయేట్ మ‌రియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల‌లో వైద్య విద్య‌ను, నర్సింగ్ సంబంధిత విద్య‌ బోధన జరుగనుంది. ప్రాథ‌మిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ఉద్దేశించిన డిజిట‌ల్ నర్వ్ సెంట‌ర్ ల ప్రారంభ సూచ‌కంగా ఒక శిలాఫ‌లకాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు.

ఊనా లో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటి)కి ప్ర‌ధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

కాంగ్‌డా లో కంద్‌రోడీ వ‌ద్ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎఐఎల్‌) యొక్క స్టీల్ ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

***