పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆక్సిజన్ చాలినంత గా సరఫరా అయ్యేటట్టు చూడటానికి గాను ఆక్సిజన్ లభ్యత  స్థితి పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి

దేశం లో వైద్యానికి ఉపయోగించే ప్రాణ వాయువు సరఫరా చాలినంత గా ఉండేటట్టు చూడటం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒక సమగ్ర సమీక్ష ను నిర్వహించారు. ఈ సందర్భం లో ఆరోగ్య శాఖ, వాణిజ్యం- పరిశ్రమ శాఖ కు చెందిన  కేంద్ర ప్రభుత్వ విభాగం అయిన డిపార్ట్ మెంట్ ఫార్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రి ఎండ్ ఇంటర్ నల్ ట్రేడ్ ( డిపిఐఐటి ) , ఉక్కు, రహదారి రవాణా వగైరా మంత్రిత్వ శాఖ లు కూడా వాటి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది.  వివిధ మంత్రిత్వ శాఖ లు, రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం తో కలసి పనిచేయడం ముఖ్యం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ఆక్సిజన్ సరఫరా తాలూకు ప్రస్తుత స్థితి ని గురించి, అధిక భారం ఉన్న 12 రాష్ట్రాలు (మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ, తమిళ నాడు, పంజాబ్, హరియాణా, రాజస్థాన్) లో రానున్న 15 రోజుల లో దీని ఉపయోగం ఎంత ఉండగలదన్న అంశం గురించి కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమగ్ర సమీక్ష జరిపారు.  ఈ రాష్ట్రాల లో జిల్లాల స్థాయి లో గల స్థితి తాలూకు పైపై పరిశీలన ను ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది.

కేంద్రం, రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుకొంటూ ఉన్నాయని, ఏప్రిల్ 20వ, ఏప్రిల్ 25వ, ఏప్రిల్ 30వ తేదీల నాటికి అవసరం ఎంత ఉండవచ్చన్న అంచనా ల తాలూకు సమాచారాన్ని రాష్ట్రాల కు తెలియజేయడమైందని ఈ సమీక్ష సమావేశం లో ప్రధాన మంత్రి కి వెల్లడి చేశారు.  దీనికి అనుగుణం గా ఈ రాష్ట్రాల అవసరాల ను తీర్చడానికి గాను ఏప్రిల్ 20వ తేదీ వరకు 4,880 ఎమ్ టి, ఏప్రిల్ 25వ తేదీ వరకు 5,619 ఎమ్ టి, ఏప్రిల్ 30వ తేదీ వరకు 6,593 ఎమ్ టి కేటాయించడం జరిగింది.

పెరుగుతున్న గిరాకీ ని తట్టుకోవడం కోసం దేశం లో ఉత్పత్తి సామర్థ్యాన్ని గురించి ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది.  ప్రతి ఒక్క ప్లాంటు సామర్థ్యం మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి ని పెంచవలసింది అంటూ ప్రధాన మంత్రి సూచన చేశారు.  ఉక్కు ప్లాంటులలో మిగులు గా ఉన్న ఆక్సిజన్ సప్లయ్ నిలవల ను వైద్యపరమైనటువంటి ఉపయోగం కోసం ఇవ్వజూపడం జరుగుతున్నదన్న అంశం చర్చ లో చోటు చేసుకొంది.

ఆక్సిజన్ ను చేరవేసే ట్యాంకర్ లు దేశం అంతటా సాఫీ గా, స్వేచ్ఛాయుతం గా తిరిగేందుకు తగిన చర్యలు తీసుకోవలసింది అంటూ అధికారుల కు ప్రధాన మంత్రి   విజ్ఞ‌ప్తి చేశారు.  ఆక్సిజన్ ట్యాంకర్ లు అన్ని రాష్ట్రాల నడుమ రాక- పోకలను సులభం గా జరిపేందుకు వీలు గా వాటికి పర్మిట్ ల రిజిస్ట్రేశన్ ప్రక్రియ నుంచి ప్రభుత్వం మినహాయింపు ను ఇచ్చింది.  డ్రైవర్ లు శిఫ్టు ల పద్ధతి లో పనిచేస్తూ ఆక్సిజన్ ట్యాంకర్ లు రోజు లో ఇరవై నాలుగు గంటలూ అందుబాటు లో ఉంటూ వేగం గా రాక- పోకల ను జరిపేటట్టు చూడవలసిందిగాను, అలాగే పెరుగుతున్న డిమాండు ను తీర్చడం కోసం చాలినంత సామర్థ్యాన్ని అందుబాటులో ఉంచవలసిందిగాను రాష్ట్రాల కు, రవాణా సంస్థల కు సూచనలు చేసిన సంగతి ని ప్రధాన మంత్రి కి తెలియజేయడమైంది.  సిలిండర్ లను నింపే ప్లాంటులు కూడా అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలను తీసుకొంటూ 24 గంటల పాటు పనిచేయడానికి గాను ఆ ప్లాంటుల కు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది.  పారిశ్రామిక సిలిండర్ లను అవసరమైనంత మేరకు శుద్ధి చేసిన అనంతరం మెడికల్ ఆక్సిజన్ కై ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం సంబంధిత అనుమతి ని ఇస్తోంది.  అదే మాదిరి గా, ట్యాంకర్ ల పరంగా ఒకవేళ కొరత ఏర్పడే పక్షం లో, ఆ లోటు ను అధిగమించడం కోసం నైట్రోజన్ ట్యాంకర్ లను, ఆర్గాన్ ట్యాంకర్ లను సైతం ఆటోమేటిక్ ప్రాతిపదిక న ఆక్సిజన్ ట్యాంకర్ లు గా మలచడానికి వాటి లో తగిన మార్పులను చేసేందుకు అనుమతులను ఇవ్వడం జరుగుతుంది.

అధికారులు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ను దిగుమతి చేసుకోవడం కోసం జరుగుతున్న ప్రయాసల ను గురించి కూడా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు.

 

***