పిఎంఇండియా
డెహ్రాడూన్–ఢిల్లీ ఆర్థిక కారిడార్ ద్వారా ఈ మొత్తం ప్రాంతం ముఖచిత్రం మారిపోనుంది. దీనివల్ల కలిగే మొదటి ప్రయోజనం, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రయాణం ఖర్చు తక్కువగా, వేగంగా మారుతుంది. ప్రజల పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గుతాయి. ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక రెండవ ప్రధాన ప్రయోజనం ఉపాధి రూపంలో లభిస్తుంది. ప్రస్తుతం దీని నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో వేలాది మంది కార్మికులకు పని దొరికింది. దీనితో పాటు, ఇంజనీర్లు, ఇతర నైపుణ్యం కలిగిన సిబ్బంది, రవాణా రంగంతో సంబంధం ఉన్న భాగస్వాములకు కూడా భారీ స్థాయిలో ఉపాధి లభించింది. ఇప్పుడు రైతులు, పశుపోషకుల ఉత్పత్తులు కూడా వేగంగా పెద్ద పెద్ద మార్కెట్లకు, ప్రధాన విపణి కేంద్రాలకు చేరుతాయి.
మిత్రులారా!
ఈ అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేష్, ముస్సోరీ, చార్‌ధామ్ యాత్రలకు ఇది అత్యంత కీలకమైన మార్గంగా మారుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందినప్పుడు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఆదాయం లభిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. హోటళ్లు, దాబా యజమానులు, టాక్సీలు, ఆటోలు లేదా హోమ్‌స్టేలు ఇలా అందరూ దీని ద్వారా లాభపడతారు.
మిత్రులారా!
ఉత్తరాఖండ్ నేడు శీతాకాల పర్యాటకం, శీతాకాల క్రీడలు, ‘వెడ్ ఇన్ ఇండియా‘ వంటి వివాహ వేడుకలకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా మారుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
మిత్రులారా!
ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థకు ఏడాది పొడవునా కొనసాగే పర్యాటకం చాలా అవసరం. అందుకే శీతాకాలంలో జరిగే ఆధ్యాత్మిక యాత్రల విషయంలో నేను చాలా పట్టుదలగా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ యాత్రల్లో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతుండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను 2023లో ఆది కైలాసం, ఓం పర్వతం యాత్రకు వెళ్లాను. అంతకుముందు నేను తరచుగా వెళ్లేవాడిని. కానీ మధ్యలో అస్సలు వెళ్లలేకపోయాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వెళ్లాను. నేను 2023లో అక్కడికి వెళ్లిన తర్వాత, అప్పటి నుంచి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారని ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా నాకు చెప్పారు. గతంలో శీతాకాల యాత్ర కోసం అక్కడికి కేవలం వందల సంఖ్యలో మాత్రమే ప్రజలు వెళ్లేవారు. కానీ 2025 సంవత్సరంలో, సుమారు 40 వేల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర స్థలాలను సందర్శించారు. ఒకప్పుడు వెయ్యి మంది కూడా వెళ్లని చోటికి, ఇప్పుడు నలభై వేల మంది చేరుకుంటున్నారంటే ఇక్కడి ప్రజల జీవనోపాధికి ఎంతటి బలం చేకూరుతుందో ఆలోచించండి. అదేవిధంగా, 2024 శీతాకాల చార్‌ధామ్ యాత్రలో దాదాపు ఎనభై వేల మంది భక్తులు రాగా, 2025 నాటికి ఈ సంఖ్య లక్షన్నర మార్కును దాటిపోయింది.
మిత్రులారా!
అభివృద్ధి, ప్రకృతి, సంస్కృతి కలిసి ఉండే వికసిత భారతాన్ని నిర్మించే పనిలో మనం నిమగ్నమై ఉన్నాం. అందుకే, నేడు జరుగుతున్న ప్రతి నిర్మాణం కూడా అభివృద్ధి, ప్రకృతి, సంస్కృతి తో కూడిన ‘త్రివేణి‘ విలువల ఆధారంగానే రూపుదిద్దుకుంటోంది. మౌలిక సదుపాయాల వల్ల ప్రజలకు సౌకర్యం ఉండాలి. అదే సమయంలో అక్కడ నివసించే వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నదే మా ప్రయత్నం. అందుకే సుమారు 12 కిలోమీటర్ల పొడవునా వన్యప్రాణుల కోసం ఎత్తైన వంతెన మార్గం (ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్) నిర్మించాం. ఏనుగులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం.
మిత్రులారా!
దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు, యాత్రికులకు ఈ రోజు నాదో విన్నపం. మన పర్వతాలు, ఈ అటవీ ప్రాంతాలు, ఈ దేవభూమి వారసత్వం – ఇవన్నీ ఎంతో పవిత్రమైన ప్రదేశాలు. ఇటువంటి ప్రాంతాలను శుభ్రంగా, నిర్మలంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ఇక్కడ నివసించే వారిదే కాకుండా, ప్రయాణికులుగా ఇక్కడికి వచ్చే వారి బాధ్యత కూడా. ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలు, చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉండటం దేవభూమి పవిత్రతను దెబ్బతీస్తాయి. అందుకే మన దేవభూమిలోని ఈ పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.
మిత్రులారా!
వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా కూడా జరగనుంది. ఈ భక్తి సంగమాన్ని దివ్యంగా, భవ్యంగా, అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మనం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు.
మిత్రులారా!
ఉత్తరాఖండ్‌లో నందా దేవి రాజ్ జాత్ యాత్ర కూడా జరుగుతుంది. ఇది కేవలం ఒక విశ్వాస పండుగ మాత్రమే కాదు. మన సాంస్కృతిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ నందా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి, పూర్తి గౌరవమర్యాదలతో వీడ్కోలు పలుకుతారు. ఈ యాత్రలో సోదరీమణులు, కుమార్తెల భాగస్వామ్యం దీనికి ఒక ప్రత్యేకతను చేకూరుస్తుంది. నందా మాతకు ప్రణామం చేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు కుమార్తెలకు నేను ఒక ప్రత్యేక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మీ పాత్ర చాలా పెద్దది. ఈ దేశపు కుమార్తెలు, తల్లులు, అక్కాచెల్లెళ్ల పాత్రను నేను చాలా కీలకంగా చూస్తున్నాను. అక్కాచెల్లెళ్ళు, కుమార్తెల సౌకర్యం, భద్రత, ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యం ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రస్తుతం ప్రపంచంలో ఎంతటి పెద్ద సంక్షోభం వచ్చిందో మీరు చూస్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఎంతటి హాహాకారాలు వ్యక్తమవుతున్నాయో మనకు తెలుసు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, మన ఆడబిడ్డలకు ఎక్కువ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నదే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం.
మిత్రులారా!
అక్కాచెల్లెళ్ళు, కుమార్తెల భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన మైలురాయి ఇప్పుడు దేశం ముందుకు వచ్చింది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత, పార్లమెంటు ‘నారీ శక్తి వందన్ అధినియం‘ను ఆమోదించింది. దీని ద్వారా శాసనసభలు, లోక్‌సభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఖరారు అయింది. ఈ ముఖ్యమైన చట్టానికి అన్ని పార్టీలు ముందుకు వచ్చి మద్దతు తెలిపాయి. ఇప్పుడు మహిళలకు ఈ హక్కు లభించినందున, దీనిని అమలు చేయడంలో ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. ఇప్పుడు ఇది కచ్చితంగా అమలు కావాలి. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల నుంచి, అలాగే ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు జరిగినా, ఈ చట్టం 2029 నుంచే అమలులోకి వస్తుంది. ఇది దేశం మనోభావం. దేశంలోని ప్రతి సోదరి, కుమార్తెల ఆకాంక్ష. ఈ మాతృశక్తి ఆకాంక్షకు తలవంచి, ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ఒక ప్రత్యేక చర్చ జరగనుంది. రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏకాభిప్రాయంతో దేశంలోని అక్కాచెల్లెళ్ళు, కుమార్తెల హక్కులకు సంబంధించిన ఈ పనిని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేయాలి. నేడు దేశంలోని సోదరీమణులందరి పేరిట నేను ఒక బహిరంగ లేఖ రాశాను. బహుశా సోషల్ మీడియా ద్వారా నా ఈ లేఖ మీ వద్దకు చేరి ఉండవచ్చు.టీవీ, వార్తాపత్రికల వారు కూడా ఈ లేఖ గురించి ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దేశంలోని తల్లులను, అక్కాచెల్లెళ్లను నేను మనసారా ఆహ్వానించాను. దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్ళు కచ్చితంగా ఈ లేఖను చదువుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు అందులోని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటారు. ఇంతటి గొప్ప పవిత్ర కార్యం చేసేందుకు 16,17,18 తేదీలలో పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కూడా వారి ఆశీస్సులు లభిస్తాయి. నేడు ఈ దేవభూమినుంచి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటికీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. నారీ శక్తి వందన్ అధినియం సవరణకు చిత్తశుద్ధితో మద్దతు ఇవ్వండి. 2029 నాటికి, మన దేశ జనాభాలో 50 శాతం ఉన్న మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు వారి హక్కును అందిద్దాం.
మిత్రులారా!
నేను ఉత్తరాఖండ్‌కు వచ్చి సైన్యం గురించి మాట్లాడకపోతే, ఆ ప్రసంగం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఈ గర్హీ కంటోన్మెంట్, ఈ సభా వేదిక ఉత్తరాఖండ్ గొప్ప సైనిక సంప్రదాయానికి నిదర్శనం. ఇక్కడికి సమీపంలో దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. 1962 యుద్ధంలో షహీద్ జస్వంత్ సింగ్ రావత్ ప్రదర్శించిన పరాక్రమాన్ని దేశం ఎన్నటికీ మరువలేదు.
మిత్రులారా!
సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కావచ్చు లేదా మన సైనిక కుటుంబాల సౌకర్యం, గౌరవం కావచ్చు. మా ప్రభుత్వం వీటి కోసం నిరంతరం కృషి చేస్తోంది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్‘ (ఓఆర్ఓపీ) ద్వారా మా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు లక్షా పాతిక వేల కోట్ల రూపాయలను మాజీ సైనికుల ఖాతాల్లో జమ చేసింది. ఉత్తరాఖండ్‌లోని వేలాది కుటుంబాలు కూడా దీని వల్ల ప్రయోజనం పొందాయి. ఇది కాకుండా, ఈ ఏడాది మాజీ సైనికుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) బడ్జెట్‌ను కూడా ముప్పై ఆరు శాతం పెంచాం. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మాజీ సైనికుల కోసం ఇంటి వద్దకే మందుల పంపిణీ సౌకర్యాన్ని కూడా ప్రారంభించాం. మాజీ సైనికుల పిల్లల విద్యా గ్రాంట్‌ను కూడా రెట్టింపు చేశాం. అలాగే, కుమార్తెల వివాహానికి అందించే సహాయాన్ని 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాం.
మిత్రులారా!
దేశభక్తి, దైవభక్తి, ప్రగతి వంటి ప్రతి కోణాన్ని జోడిస్తూ మనం దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలి. మరొకసారి ఢిల్లీ ప్రజలకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, అలాగే దేశప్రజలందరికీ ఈ అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వే సందర్భంగా నా అనేకానేక శుభాకాంక్షలు.
నాతో కలసి చెప్పండి –
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
The Delhi-Dehradun Economic Corridor, being inaugurated today, is a world-class infrastructure project that will deepen connectivity, boost the economy and tourism. https://t.co/5TayGK4QLZ
— Narendra Modi (@narendramodi) April 14, 2026
उत्तराखंड राज्य अपनी स्थापना के 25 वर्ष पूरा करने के साथ ही 26वें वर्ष में प्रवेश कर चुका है।
— PMO India (@PMOIndia) April 14, 2026
आज दिल्ली-देहरादून एक्सप्रेस-वे के उद्घाटन के साथ इस प्रगति में एक और बड़ी उपलब्धि जुड़ी है: PM @narendramodi
देहरादून-दिल्ली इक्नॉमिक कॉरिडोर से भी इस पूरे क्षेत्र का कायाकल्प होने जा रहा है।
— PMO India (@PMOIndia) April 14, 2026
पहला फायदा तो ये है कि इससे समय बचेगा... आना-जाना सस्ता और तेज होगा... लोगों का पेट्रोल-डीजल कम खर्च होगा... किराया-भाड़ा कम होगा।
दूसरा बड़ा फायदा रोजगार का होगा: PM @narendramodi
हमारे पहाड़...ये वन क्षेत्र...देवभूमि की ये धरोहर... ये बहुत ही बहुत पवित्र स्थान हैं।
— PMO India (@PMOIndia) April 14, 2026
ऐसे स्थानों को साफ-सुथरा रखना हम सभी का कर्तव्य है।
इन इलाकों में प्लास्टिक की बोतलें...कूड़े-कचरे का ढेर... ये देवभूमि की पवित्रता को ठेस पहुंचाता है।
इसलिए बहुत आवश्यक है कि हम देवभूमि के…