పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘మై నహీ హమ్’’ పోర్టల్, ఇంకా యాప్ ల ప్రారంభం సంద‌ర్భంగా ఐటి మ‌రియు ఎల‌క్ట్రానిక్ మాన్యుఫాక్చ‌రింగ్ వృత్తి నిపుణుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

‘‘మై నహీ హమ్’’ పోర్టల్, ఇంకా యాప్ ల ప్రారంభం సంద‌ర్భంగా ఐటి మ‌రియు ఎల‌క్ట్రానిక్ మాన్యుఫాక్చ‌రింగ్ వృత్తి నిపుణుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

‘‘మై నహీ హమ్’’ పోర్టల్, ఇంకా యాప్ ల ప్రారంభం సంద‌ర్భంగా ఐటి మ‌రియు ఎల‌క్ట్రానిక్ మాన్యుఫాక్చ‌రింగ్ వృత్తి నిపుణుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

‘‘మై నహీ హమ్’’ పోర్టల్, ఇంకా యాప్ ల ప్రారంభం సంద‌ర్భంగా ఐటి మ‌రియు ఎల‌క్ట్రానిక్ మాన్యుఫాక్చ‌రింగ్ వృత్తి నిపుణుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘మై నహీ హమ్’’ పోర్టల్ తో పాటు యాప్ ను నేడు న్యూ ఢిల్లీ లో ప్రారంభించారు.

ఈ పోర్ట‌ల్ “Self4Society” ఇతివృత్తం పై ఆధార‌ప‌డి ప‌ని చేస్తుంది. ఐటి వృత్తి నిపుణులు మ‌రియు సంస్థ లు ఒకే వేదిక మీద నుండి సామాజిక అంశాల దిశ‌ గాను, స‌మాజానికి సేవ చేసే దిశ‌ గాను కృషి చేసేట‌ట్లు ఇది దోహ‌దప‌డుతుంది. ఈ క్ర‌మం లో స‌మాజం లోని బ‌ల‌హీన వ‌ర్గాల కు సేవ చేయ‌డం లో, ప్ర‌త్యేకించి సాంకేతిక విజ్ఞానం తాలూకు ప్ర‌యోజ‌నాల‌ను వినియోగించుకొంటూ మ‌రింత స‌మ‌న్వ‌యానికిగాను ఈ పోర్ట‌ల్ తోడ్ప‌డుతుంద‌ని ఆశిస్తున్నారు. స‌మాజ ప్ర‌యోజ‌నం కోసం కృషి చేయాల‌నే ప్రేర‌ణ క‌లిగిన వ్య‌క్తులు మ‌రింత ఎక్కువ సంఖ్య‌ లో పాలుపంచుకొనేట‌ట్లుగా ఇది చేయ‌గ‌లుగుతుంద‌ని కూడా భావిస్తున్నారు.

ఈ సంద‌ర్భం గా సభ కు విచ్చేసిన ఐటి వృత్తి నిపుణులు, ఎల‌క్ట్రానిక్ మాన్యుఫాక్చ‌రింగ్ వృత్తి నిపుణులు, ప‌రిశ్ర‌మ సార‌థులు, టెక్నక్రాట్ లను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇత‌రుల కోసం ప‌ని చేయాల‌ని, స‌మాజానికి చేదోడుగా నిల‌వాల‌ని, అలాగే ఒక స‌కారాత్మ‌క‌మైన వ్య‌త్యాసాన్ని తీసుకు రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని తాను నమ్ముతున్నానన్నారు.

ప్ర‌ధాన మంత్రి తో సంభాషణ లో పాలుపంచుకొన్న వారిలో శ్రీ ఆనంద్ మ‌హీంద్ర‌, శ్రీ‌మ‌తి సుధా మూర్తి ల‌తో పాటు భార‌త‌దేశం లో గల అగ్రగామి ఐటి కంపెనీలకు చెందిన యువ వృత్తి నిపుణులు అనేక మంది ఉన్నారు.

ప్ర‌తి ఒక్క ప్ర‌య‌త్నానికి- అది ఎంత పెద్ద‌ది అయినా గాని, లేదా చిన్న‌ది అయినా గాని- దాని విలువ ను దానికి ఇవ్వాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వాల వ‌ద్ద ప‌థ‌కాలు మ‌రియు బ‌డ్జెట్ లు ఉండ‌వ‌చ్చు; అయితే ఏ కార్య‌క్ర‌మం అయినా సఫలం కావాలంటే అది ప్ర‌జ‌ల ప్ర‌మేయం తోనే అవుతుంది అని ఆయ‌న పేర్కొన్నారు. అన్యుల జీవితాల్లో ఓ స‌కారాత్మ‌క‌ వ్య‌త్యాసాన్ని కొని తేవ‌డం కోసం మ‌న బలాల‌ను ఏ విధంగా మనం ఉప‌యోగించ‌గ‌ల‌ం అనే ఆలోచ‌నను చేద్దాం అని ప్ర‌ధాన మంత్రి స‌భికుల‌కు ఉద్బోధించారు.

సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ని భార‌త‌దేశం లో యువ‌జ‌నులు చాలా చ‌క్క‌గా వినియోగించుకొంటున్నార‌ని తాను భావిస్తున్నాన‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. వారు సాంకేతిక విజ్ఞానాన్ని వారి కోస‌మే కాకుండా ఇత‌రుల సంక్షేమానికి కూడా ఉప‌యోగిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇది ఒక మంచి సూచిక అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు. సామాజిక రంగం లో స్టార్ట్‌-అప్ లు అనేకం ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, యువ సామాజిక న‌వ పారిశ్రామికులు రాణించాల‌ని ఆకాంక్షించారు.

ఒక పుర మందిరం త‌ర‌హా లో సాగిన సంభాష‌ణ క్ర‌మం లో, స‌భికుల ప్ర‌శ్న‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి సమాధానాలు ఇచ్చారు. మ‌నకు సౌక‌ర్య‌వంతం గా ఉన్నటువంటి విష‌యాల్లో నుండి బ‌య‌ట‌కు రావ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. కనుగొనడానికి మరియు నేర్చుకోవ‌డానికి ఎన్నో అంశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

సమాజం కోసం స్వ‌చ్ఛందంగా సాగే ప్రయత్నాలను గురించి, ప్ర‌త్యేకించి నైపుణ్యాల‌ను అల‌వ‌ర‌చుకోవ‌డాన్ని గురించి, స్వ‌చ్ఛ‌త గురించి ఐటి వృత్తి నిపుణులు వారు చేస్తున్నటువంటి కృషి ని వివ‌రించారు. ఒక ప్ర‌శ్న‌ కు స‌మాధానంగా ప్ర‌ధాన మంత్రి బాపు క‌ళ్ళ‌జోడు ను ‘స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్’ యొక్క చిహ్నం గా తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి బాపూ యే ప్రేర‌ణ ను అందిస్తున్నారని, బాపు దార్శ‌నిక‌త‌ ను మనమంతా కార్య‌రూపం లోకి తీసుకు వ‌స్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

అనేక సంద‌ర్భాల్లో ‘స‌ర్కారు’’ చేయ‌లేని దానిని ‘‘సంస్కారం’’ చేసి చూపెడుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘స్వ‌చ్ఛ‌త’ను మ‌న విలువ ల‌లో ఒక విలువ‌ గా జోడించుకొందామ‌ని ఆయ‌న సూచించారు.

నీటి ని పొదుపుగా వాడుకోవ‌డానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, జ‌ల సంర‌క్ష‌ణ ను గురించి నేర్చుకొనే క్ర‌మం లో ప్ర‌జ‌లు గుజ‌రాత్ లోని పోర్‌బంద‌ర్‌ ను సంద‌ర్శించాల‌ని, అక్క‌డ గాంధీ మ‌హాత్ముని ఇంటి ని వారు చూడాల‌ంటూ విజ్ఞ‌ప్తి చేశారు. మ‌నం నీటి ని ఆదా చేసుకొని, నీటిని ప్ర‌క్షాళించుకోవల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్న మ‌న రైతులు బిందు సేద్యాన్ని అనుస‌రించాల‌ని నేను వారికి విన్న‌పం చేస్తున్నాన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స్వ‌యంగా చొర‌వ తీసుకోవ‌డం ద్వారా వ్య‌వ‌సాయ రంగం లో ఎన్నో సాధించ‌వ‌చ్చున‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. యువ‌జ‌నులు ముందుకు వ‌చ్చి రైతుల సంక్షేమానికై న‌డుంక‌ట్టాల‌ని ఆయ‌న చెప్పారు.

ప‌న్నులు చెల్లించ‌డానికి చాలా మంది ముందుకు వ‌స్తున్నార‌ని, వారి డ‌బ్బు ను స‌రియైన రీతిలో వినియోగిస్తూ ప్ర‌జ‌ల సంక్షేమానికి ఉప‌యోగించ‌డ‌మే దీనికి కారణం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

భార‌త‌దేశం త‌న యువ‌త ప్ర‌తిభ వ‌ల్లే స్టార్ట్‌-అప్ రంగం లో పేరు తెచ్చుకొంటోంద‌ని ఆయ‌న అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో డిజిట‌ల్ రంగం లో న‌వ పారిశ్రామికుల‌ను తీర్చిదిద్ద‌డం కోసం కృషి చేస్తున్న‌టువంటి ఒక బృందాని కి ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు తెలుపుతూ, ప్ర‌తి ఒక్క‌రికి స‌మానావ‌కాశాలు ల‌భించేట‌టువంటి భార‌త‌దేశాన్ని ఆవిష్క‌రించ‌డం ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు.

సామాజిక కృషి చేయ‌డ‌మ‌నేది ప్ర‌తి ఒక్క‌రికి గొప్ప గ‌ర్వ‌కార‌ణం అయ్యే విష‌యం కావాలి అని ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు.

వ్యాపారాన్ని, ప‌రిశ్ర‌మ‌ను విమ‌ర్శించే ధోర‌ణి తో ప్ర‌ధాన మంత్రి విభేదిస్తూ, కార్పొరేట్ ప్ర‌ముఖులు ఏ విధంగా చ‌క్క‌ని సామాజిక కృషి ని సాగిస్తున్నారో ఈ పుర మందిర కార్య‌క్ర‌మం నిరూపించింద‌న్నారు. ఆయా కార్పొరేట్ ల ఉద్యోగులు సైతం ముందుకు కదలి ప్ర‌జ‌లకు స‌హాయ ప‌డాలంటూ వారికి ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

***