అంతర్జాతీయ వృద్ధికి ఒక కొత్త ఇంజిన్ ను అందించాలని భారతదేశం భావిస్తోంది. విస్తారమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. భారతదేశం పెద్దది, వృద్ధి పథంలో ఉన్నది అయిన మార్కెట్ ను అందిస్తోంది. కాని భారతదేశం ఒక మార్కెట్ కన్నా విశాలమైనది. ఒక విశ్వసనీయ భాగస్వామి; మా దేశంలో అత్యున్నత స్థాయి నాణ్యత కలిగిన ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ ప్రతిభావంతులు పుష్కలంగా అందుబాటులో ఉన్నారు.