అమెరికా ఆర్థిక వ్యవస్థలో భార‌తీయ సంతతి అమెరికన్ ల వర్గం అత్యంత కీల‌క‌మైన‌ పాత్రను పోషిస్తుండడం ఈ ఉభ‌య దేశాల బాంధ‌వ్యం లోని ఒక విశిష్ట ల‌క్ష‌ణం. ఒక దేశపు ప్రవాసులు మరొక దేశంలో వ‌ల‌స‌దారులుగా ఉంటూనే రెండు దేశాలలోనూ ఉన్నత‌మైన గౌర‌వాన్ని, ప్ర‌తిష్టను ఆర్జించుకోవడం ఎంతో అరుదైన విషయం. భారతీయ సంతతి అమెరికన్ లు నానాటికీ వర్ధిల్లుతున్న మ‌న ఆర్థిక, సాంస్కృతిక బంధాల‌ను మ‌రింత ప‌టిష్టంగా నిలిపి ఉంచే శ‌క్తి అని చెప్పాలి.