అమెరికా వ్యాపార సంస్థలు వాటి ఆర్థిక వృద్ధి కోసమని కొత్త రంగాలను, వాటి వ‌స్తువుల‌ను విక్క్రయించడానికి కొత్త బజారులను, నిపుణులైన మానవ వనరులను, ఉత్పత్తి మరియు త‌యారీ కోసమని కొత్త ప్ర‌దేశాలను వెదకుతున్నాయి. ఈ క్రమంలో భార‌తదేశం వాటికి ఆద‌ర్శ‌ భాగ‌స్వామి కాగలదు. భారతదేశపు బలమైన ఆర్థిక వ్యవస్థ, సాలీనా 7.6 శాతం స్థాయిలో భారతదేశం సాధిస్తున్న వృద్ధి రేటు, ప‌ర‌స్ప‌ర సుసంప‌న్న‌తకు కొత్త అవ‌కాశాలను అందుబాటులోకి తెస్తున్నది.