ఆధునిక భార‌తం 70వ సంవత్సరంలో ఉంది. నా ప్ర‌భుత్వానికి రాజ్యాంగ‌మే ప‌విత్ర గ్రంథం. ఆ ప‌విత్ర‌ గ్రంథంలో ఏ ధర్మాన్నయినా అవలంబించే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, ఓటు హ‌క్కు‌, పౌరులంద‌రి మ‌ధ్య స‌మాన‌త్వం అనేవి పూర్వ రంగంతో సంబంధం లేకుండా ప్రాథ‌మిక హ‌క్కులుగా ఉల్లేఖించబడ్డాయి. ప్ర‌తి అయిదు సంవత్సరాలకు ఒక సారి 800 మిలియన్ మంది నా దేశ వాసులు ఓటు వేసే హ‌క్కును వినియోగించుకొనే అవకాశం ఉంది. మా దేశపు 1.25 బిలియన్ పౌరులు భయం నుండి విముక్తిని పొందారు. వారు వారి జీవితాలలోని ప్ర‌తి క్ష‌ణమూ ఈ నిర్భయాన్ని అనుభూతి చెందుతున్నారు.