ఏడాది క్రితం 125 కోట్ల జనాభా గల ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మార్పు, అభివృద్ధికి అనుకూలంగా ఓటు వేసింది. విస్తృతమైన సామాజిక, ఆర్థిక భిన్నత్వాలను పరిగణలోకి తీసుకుంటే అది ఎంత పెద్ద సవాలో మాకు తెలుసు. అయినా, ఐకమత్యం నుంచి మేం జాతిని ముందుకు నడిపించే విశ్వాసం సాధించగలిగాం. జనాభాలో 80 కోట్లకు పైగా ఉన్న 35 సంవత్సరాలలోపు యువశక్తి ఆశల నుంచి మేము శక్తిని సాధించాం.