ఏషియాన్‌తో మన ఒడంబడిక కేవలం మన ఉమ్మడి నాగరికతా వారసత్వపు ధృఢమైన పునాదికి సంబంధించినది మాత్రమే కాదు. మన సమాజాలకు భద్రతను కల్పించడానికీ, ఈ ప్రాంతానికి శాంతిని, సుస్థిరత్వాన్ని మరియు సమృద్ధిని అందించడానికీ మనం ఇస్తున్న ఉమ్మడి వ్యూహాత్మక ప్రాధాన్యాలకు కూడా ఈ ఒడంబడిక అవసరం. భారతదేశపు 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' (తూర్పు ఆసియా దేశాలతో మెరుగైన సంబంధాల విధానం) కి ఏషియాన్ కేంద్ర బిందువు. అంతే కాకుండా, ఈ ప్రాంతంలో సమతుల్యత, సామరస్యం నెలకొనడానికి మన పొత్తులు ఆధారంగా నిలుస్తాయి. - 14వ ఆసియాన్ భారతదేశం శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ