కొత్త ఆవిష్కరణలు, నేర్చుకోవడం, అభివృద్ధి చేయడం, అమలు పరచడం సాంకేతిక పరిజ్ఞానంలో ప్రధాన భాగాలు. అది వేగం, నిరాడంబరత, సేవాభావం అనే ఈ మూడు ఎస్ (S)లను (స్పీడ్, సింప్లిసిటీ, సర్వీస్) అనుసంధానం చేస్తుంది. ప్రజలకు సత్వరం సమర్థవంతంగా, సరళంగా సేవలు అందించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం ఎంతగా ఉపయోగించుకుంటే అంత ప్రయోజనం సమకూరుతుంది.