‘‘జిఎస్ టి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు చోటు చేసుకొన్న పన్నుల సంబంధిత సంస్కరణలలో అతి పెద్ద సంస్కరణ. ఈ సంస్కరణ దేశంలో ఒక పెనుమార్పును తీసుకురానుంది. ఇది పన్ను చెల్లింపులను ఎంతగా సులభతరంగా మార్చుతుందంటే, దేశానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకునేవారు ఎవరైనా సరే ముందుకువస్తారు. ఇది సామాన్యుడికి ఒక్కరికే మేలు చేయడమే కాకుండా, ఆదాయాలు దేశాన్ని అభివృద్ధి చేసేందుకు దోహదపడతాయి. ఇది రాష్ట్రాల మధ్య అపనమ్మకాల అధ్యాయాన్ని ముగించివేయగలదు. జిఎస్ టి పారదర్శకత్వాన్ని ఇనుమడింపచేయడంతో పాటు సమాఖ్య స్వరూపాన్ని బలపరచగలుగుతుంది. ’’ - నెట్ వర్క్ 18 కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ