దక్షిణ ఆసియా లో భారతదేశమూ, భారతదేశంతో పాటు ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆర్థిక సమృద్ధి కోసం ఒక శాంతియుతమైన మార్గాన్ని అనుసరిస్తున్నాయి. అయితే, భారతదేశపు ఇరుగుపొరుగు ప్రాంతాల లోని ఒక దేశానికి మాత్రం ఒక్క ఉగ్రవాదాన్ని ఉసిగొలిపి ఎగుమతి చేయడంలోనే స్పర్ధాత్మక ప్రయోజనం లభిస్తున్నది. ఈ ఎగుమతి శాంతి వర్ధిల్లడానికి కావలసిన జాగాను తగ్గించివేస్తూ, హింస ప్రబలడానికి జాగాను విస్తరింపచేస్తున్నది. ఇంకా అందరి మనుగడకు కావలసిన శాంతి- సమృద్ధి లను ప్రమాదంలో పడవేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్న ఈ ఉగ్రవాదాన్ని మనం నిరోధించవలసిన సమయం ఆసన్నం అయింది. దీని దుష్ప్రేరణదారుపై ఆంక్షలు విధించవలసిన తరుణం వచ్చేసింది. - 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ