నేను పూర్తి చేయవలసిన ప‌నుల‌ జాబితా పెద్ద‌దీ, మహత్వాకాంక్ష కలిగినదీనూ. ఆ జాబితాలో శ‌క్తిమంత‌మైన వ్య‌వ‌సాయ రంగంతో కూడిన చ‌ల‌న‌శీల‌ గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డం, ప్రతి కుటుంబానికి ఇల్లు, విద్యుత్ సౌకర్యం‌ కల్పించడం, మిలియన్ ల సంఖ్యలో ఉన్న యువ‌తీయువకులకు నైపుణ్యాన్ని అందజేయడం‌, 1000 స్మార్ట్ న‌గ‌రాల నిర్మాణం, ఒక బిలియన్ మంది బ్రాడ్ బ్యాండ్ సదుపాయాన్ని కలిగి ఉండేటట్లు చర్యలు తీసుకోవడం, మా గ్రామాలను డిజిట‌ల్ ప్ర‌పంచంతో అనుసంధానించడం, 21వ శ‌తాబ్దికి దీటైన రైలు, రహదారి, నౌకాశ్రయ మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. ఇవి మహత్వ ఆకాంక్షలు మాత్రమే కాదు.. క‌ర్బ‌న ఉద్గారాలను తేలికపాటి స్థాయికి చేర్చడంతో పాటు పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులకు పెద్ద పీట వేస్తూ నిర్దిష్ట కాలం లోపల సాధించవలసివున్న ల‌క్ష్యాలు ఇవి.