పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న వారి నాణ్యత ఇవాళ్టి విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మూలం. విద్యార్జన ఫలితాల నాణ్యతను పెంపొందించడమే ప్రభుత్వ ప్రాధమిక ఉద్దేశం కావాలి. తదనుగుణంగా సర్వ శిక్షా అభియాన్ కు వనరుల వాటా ను మరింత పెంచి, కేటాయింపు జరుపుతాం. ఈ నిధులను విజ్ఞానార్థుల ప్రతిభ మెరుగుపడేటందుకు స్థానికంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి, నవకల్పన లకు వినియోగించడం జరుగుతుంది.