పార్లమెంట్ ఉన్నది చర్చల కోసమే. అభిప్రాయాల భేదాలను వ్యక్తీకరించడానికే పార్లమెంట్. ఎవరైనా దేనినైనా వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు అందుకు సమర్థనగా వారి వాణిని వినిపించడానికి, అలాగే దేనినైనా వారు బలపరుస్తున్నప్పుడు అలా ఎందుకు బలపరుస్తున్నదీ చాటిచెప్పడానికి పార్లమెంట్ ఒక వేదిక. పార్లమెంట్ కు ఉన్న ఈ మౌలిక స్ఫూర్తిని పరిరక్షించడమే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం. ఇది పార్లమెంట్ లోపల, పార్లమెంట్ కు వెలుపల ఉన్న వారి బాధ్యత కూడా. అధికారంలో ఉన్న వారి, అధికారంలో లేని వారి బాధ్యత కూడాను. ఇది తు.చ. తప్పక అనుసరించవలసిన అంశం. - 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్ ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.