పెట్రోలియం రంగం లో భారీ విధాన సంస్కరణ. కొత్త హైడ్రోకార్బన్ అన్వేషణ లైసెన్సింగ్ విధానంలో భాగంగా ధరల నిర్ణయంలోను, మార్కెటింగ్ లోను స్వేచ్ఛతో పాటు, ఆదాయం పంపకం విధానం లో పారదర్శకమైన పద్ధతి ఉంటుంది. ఇది అధికారగణం నియంత్రణ పరంగా ఉన్న అనేకమైన అంచెలను తొలగిస్తుంది.