ప్రతి ఒక్కరు సంపదను పంచుకోగల ఆసియా ఖండం అభివృద్ధి కావాలన్నదే భారత్ ఆశయం. దీనివల్ల ఒక జాతి విజయం మరో జాతికి బలంగా మారుతుంది. వృద్ధి అన్ని జాతులకు విస్తరించి సమ్మిళితం అవుతుంది. ఇది ఒక్క జాతీయ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అన్ని ప్రాంతాల బాధ్యత. అన్నింటికన్నా మించి భారతదేశం అభివృద్ధి ఆసియా మొత్తానికి విజయగాథగా నిలుస్తుంది. దీనివల్ల ఆసియా దేశాల కల వాస్తవంలోకి వస్తుంది.