ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో అత్యంత ప్రకాశవంతమైన కేంద్రాలలో ఒకటి భారతదేశం. మనకు ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది; వాణిజ్య చెల్లింపుల శేషం కూడా తక్కువే, కరెంట్ ఖాతా లోటు సైతం తక్కువగానే ఉంది; ఇక వృద్ధి రేటును చూస్తే అధికంగా ఉంది. ఇది మంచి విధానాల వల్ల సాధ్యమైంది, అంతే కాని - అదృష్టం వరించడం వల్ల వచ్చిందేమీ కాదు.