భారత్ అద్భుతమైన పరివర్తనను సాధిస్తోంది. మా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే త్వరితగతిన వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఆకర్షణీయమైన, సుస్థిర నగరాలు, శక్తిమంతమైన వ్యవసాయ రంగం, శక్తిమంతమైన తయారీ రంగం, చలనశీల కలిగిన సేవల రంగం అండదండలతో ఆర్థిక రంగం ఎదగాలని మేం కోరుకొంటున్నాం. ప్రపంచ శ్రేణి నాణ్యత కలిగిన రైలుమార్గాలు, రహదారి మార్గాలు, విమానాశ్రయాలు, డిజిటల్ కనెక్టివిటీ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే శక్తులు కావాలన్నది మా ఆకాంక్ష.