మేం అధికారం చేప‌ట్టిన త‌రువాత ద్ర‌వ్యోల్బ‌ణం, విత్త‌ లోటు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గాయి. జి డి పి వృద్ధి, విదేశీమార‌కద్రవ్య నిల్వ‌లు, స్టాక్ మార్కెట్ విలువ‌లు, ఇన్ వెస్ట‌ర్ల విశ్వాసం.. ఇవన్నీ పెరిగాయి. బాగా ఆలోచించి తీసుకున్న వరుస చర్యల ఫ‌లిత‌మే ఈ విజయం.