మన దేశాలు (భారతదేశం మరియు, అమెరికా) వేరు వేరు చరిత్ర,లు భిన్న సంస్కృతులు, వివిధ ధర్మాలతో కూడుకొని ఉన్నవే కావచ్చు. అయినప్పటికీ, మన దేశాల ప్రజాస్వామ్యం పట్ల, మన దేశాల పౌరుల స్వేచ్ఛ పట్ల మనకున్న విశ్వాసం అనేవి సామాన్యాంశాలు అయి ఉన్నాయి. పౌరులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న అభిప్రాయం అమెరికా రాజ్యాంగానికి మూల స్తంభంగా నిలుస్తోంది. మా రాజ్యాంగ నిర్మాతలు కూడా అదే విధమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి పౌరుడికీ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రసాదించడానికి వారు ప్రాధాన్యం ఇచ్చారు.