యోగ యొక్క వ్యాప్తి మారుతున్న ప్రపంచానికి సంకేతం. దేశం, మత విశ్వాసం లేదా వర్గం అనే ఎల్లలేవీ లేని, జ్ఞానం ప్రవహించే ప్రపంచాన్ని యోగ సూచిస్తుంది. ఈ భూగ్రహాన్ని ఏకం చేయగల కారణాలు, ఆందోళనల నిమిత్తం ప్రజలు సరిహద్దులను అధిగమించి కలిసికట్టుగా ముందుకు సాగే ప్రపంచాన్ని యోగ చిత్రిస్తుంది. - ‘అంతర్జాతీయ యోగ దినం‘ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ