రియల్ ఎస్టేట్ మార్కెటు లో పరివర్తనను తీసుకు రావడంలో ప్రముఖ పాత్రను పోషించగల స్థిరాస్థి క్రమబద్దీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీని వల్ల కొనుగోలుదారులకు రక్షణ లభించడమే కాక, నిజాయతీ తో కూడిన ఆరోగ్యకరమైన పద్ధతులకు ఊతం లభిస్తుంది. ఎంతో కాలంగా పెండింగు లో ఉన్న ఈ బిల్లు ను ఆమోదింపచేసుకోవడంతో పాటు పేదలకు, ఇటీవల మధ్య తరగతికి ఎదిగిన వారికి ఉద్దేశించిన ఇళ్ల నిర్మాణదారులకు, ఆ ఇళ్లను కొనుగోలు చేసే వారికి మేం పన్ను ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాం.