శ్రామికుల శక్తిని మెరుగుపరచడానికి, నిరుద్యోగులకు ప్రయోజనాలు కల్పించడానికి మరొక చర్యను తీసుకున్నట్లు ప్రకటించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు అనేక ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహిస్తుంటాయి. ఈ పరీక్షలలో వచ్చిన మార్కులు ఇంతవరకు ప్రభుత్వం వద్దే ఉండేవి. ఇక నుంచి ఈ ఫలితాలతో పాటు అభ్యర్థి గురించిన సమాచారాన్ని యాజమాన్యాలకన్నింటికీ అందుబాటులో ఉండేలాగా బహిర్గతపరచుతాం. ఇది శ్రామికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఇతర (నౌకరీలు భర్తీ కావలసిన) ప్రాంతాలకు వాటికి తగిన అభ్యర్ధులను ఎంచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. .. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ గవర్నెన్స్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి.