సాంప్ర‌దాయక సవాళ్లు, సాంప్ర‌దాయేత‌ర స‌వాళ్లు ఎక్కువ‌ అవుతున్న నేప‌థ్యంలో దేశాల మ‌ధ్య రాజ‌కీయపరమైన, భద్రత పరమైన స‌హ‌కారాలు మన సంబంధాన్ని సుదృఢం చేయడంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఉగ్రవాద ఎగుమతి పెరుగుతున్నది. ద్వేష భావజాలం ద్వారా ఉగ్రవాదం పరివ్యాప్తి చెందుతున్నది. అవధులు లేని హింస ప్రబలుతున్నది. ఇవన్నీ మన సమాజాల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఈ ముప్పు ఏక కాలంలో స్థానికమైనది, ప్రాంతీయమైనది మరియు ప్రపంచవ్యాప్తమైనది కూడా. సమన్వయం, సహకారం మరియు బహుళ స్థాయిలలో పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం- వీటి మీద ఆధార పడి మన స్పందన రూపొందాలని ఏషియాన్‌తో మన భాగస్వామ్యం కోరుకుంటోంది. - 14వ ఆసియాన్ భారతదేశం శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ