‘‘సాధారణంగా ఒకటి లేదా రెండు అంశాలపై చర్చ జరుగుతూ ఉంటుంది, కానీ ఇవాళ వృద్ధిని గురించి.. అదీ, అన్ని రంగాలలో వృద్ధిని గురించి.. మాట్లాడుకోవడం జరుగుతోంది. విద్యుత్తు ఉత్పాదన పెరిగింది; అలాగే డిమాండు కూడా పెరిగింది. మౌలిక సదుపాయాల రంగంలోనూ పనులు శరవేగంగా సాగుతున్నాయి; ఆర్థిక వ్యవస్థలో డిమాండు ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. దీనంతటినుండీ అర్థమవుతున్నదేమిటంటే, మనం మంచి రోజుల వైపునకు సాగుతున్నాము అని.’’ - నెట్ వర్క్ 18 కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ