స్వేచ్ఛాయుతమైన మరియు బహుళత్వానికి ఆలవాలమైన సమాజాలకు ఉగ్రవాదం అత్యంత గంభీరమైన సవాలును విసరుతోంది. మనం కేవలం ఉగ్రవాదులనే కాకుండా, వారికి అండగా నిలబడుతున్న అన్ని వ్యవస్థలను కూడా గురి చూడవలసిన అవసరం ఉన్నది. మన అత్యంత కఠినమైన చర్యలను ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో ఒక భాగంగా మలచుకొంటున్న ప్రభుత్వం లోపలి శక్తుల విషయంలో తీసుకోవడం కోసమని అట్టిపెట్టుకోవలసి ఉన్నది. - 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ