అంత‌ర్జాతీయ శ‌క్తి సంస్థ (IEA) వ‌ర‌ల్డ్ ఎన‌ర్జీ అవుట్ లుక్ 2018 నివేదిక
“మరీ ముఖ్యంగా భార‌త‌దేశం త‌న అన్ని గ్రామాల లోనూ విద్యుదీక‌ర‌ణ ను పూర్తి చేసుకోవ‌డం అనేది శ‌క్తి ల‌భ్య‌త పరంగా చూసినప్పుడు 2018వ సంవ‌త్స‌రం లో ఒక ఘన విజ‌యభరిత గాథ‌ గా ఉంది.  శ‌క్తి సంబంధ చ‌రిత్ర లో సిద్ధించిన ఘ‌న‌మైన సాఫ‌ల్యాల లో ఇది ఒక‌టి.  గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో సాగిన రాజ‌కీయ కృషి పురోగ‌మన పయన గతి ని చెప్పుకోద‌గ్గ స్థాయి లో వేగ‌వంతం చేయడంతో 2000వ సంవ‌త్స‌రం నుండి దాదాపు అర్థ మిలియ‌న్ ప్ర‌జ‌లకు భార‌త‌దేశం లో విద్యుత్తు స‌దుపాయం అందుబాటు లోకి వచ్చింది.”