“ మన సువిశాల సముద్ర సంబంధ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి మనకు ఒక దృఢమైన భారతీయ నౌకాదళం అవసరమన్న వాస్తవం మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో స్ఫురణలోకి వచ్చింది. దేశ ఆర్థిక వృద్ధిలో సముద్ర సంబంధ ప్రయోజనాలు కీలకమైన సంబంధాన్ని కలిగి వుంటాయి. వాటిని సర్వ కాలాలలోను ఎటువంటి అడ్డంకి లేకుండా అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది. ‘బ్లూ ఎకానమీ’ ని వర్ధిల్లేటట్లు చేయాలన్న మాన్య ప్రధాన మంత్రి దార్శనికత కారణంగా భారతదేశం మరొక్క మారు తన దృష్టిని సముద్రాలకేసి సారించిందని స్పష్టమవుతోంది. అంతేకాదు, 21వ శతాబ్దంలో ఒక పునరుత్తేజం పొందినటువంటి సముద్ర సంబంధ దేశంగా ఆవిర్భవించడానికి భారతదేశం సన్నద్ధురాలై ఉంది కూడా. ”