అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో పెనుమార్పు వచ్చింది. గతంలో ఓట్లను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించేవారు. విధాన రూపకల్పన సమయంలో ఆనాటి ప్రభుత్వం వారు తిరిగి ఎన్నికయ్యేలా చూడడమే ప్రాధాన్యత. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వ విధానాలు ఏనాడూ రూపొందించలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తమలాంటి వ్యక్తులు ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నడూ చేయలేదు. అలా కాకుండా ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశ్యం ఎప్పుడూ ఉంటుంది.