అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు
ప్రజల కోసం పని చేయడం మరియు ప్రజలకు సేవ చేసేందుకు దైవం ప్రసాదించిన అవకాశాన్ని వినియోగించుకోవడం ప్రధాన మంత్రి మోదీకి అలవాటు.  ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి, ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మధ్య ఎటువంటి తేడా ఉండకూడదు.  ప్రధాన మంత్రి మోదీ ఇదే విషయాన్ని రుజువు చేశారు.  ప్రధాన మంత్రి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ రాష్ట్రం వృద్ధి రేటు 12 శాతంగా నమోదైంది.  ఆయన ఈ రోజు సంపాయించిన భారీ ప్రజా తీర్పు గత 12 సంవత్సరాలుగా ఆయన చేసిన కఠిన శ్రమ యొక్క ఫలితం తప్ప మరేమీ కాదు.  నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వలెనే ఇప్పటికీ ఉన్నారు.  ఆయన వ్యక్తిత్వం, కళా కౌశలం మరియు నాయకత్వ దక్షత.. వీటి కారణంగానే అందరి చూపులు ఆయన మీద ఉన్నాయి.