2014 పార్లమెంటరీ ఎన్నికల్లో శ్రీ నరేంద్ర మోదీ విజయంతో ఎన్నో తొలి సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్యానంతర శకంలో జన్మించిన వ్యక్తి ప్రధాన మంత్రి కావడం ఇదే ప్రథమం. ఏ ప్రభుత్వంలోనూ భాగస్వామి కాని, ఢిల్లీ పెద్దల కూటమిలో ఒకరు కాని వ్యక్తి ప్రధాన మంత్రి కావడం కూడా ఇదే తొలి సారి.