“ యాంకరింగ్ లో నాకు దక్కిన అతి పెద్ద అవకాశం అది. ఆ రోజులలో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘బిగ్ ఫైట్’ లో ఒక భాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరించవలసిందిగా నన్ను అడిగారు. విషయం కశ్మీర్ కు సంబంధించింది. నేను శ్రీ మోదీకి కాల్ చేసి, ‘ఇందులో మీరు చేరుతారా ?’ అంటూ అడిగాను. ఆ ఎపిసోడ్ లో ముగ్గురు ప్యానలిస్టులు.. వారే హురియత్ కు చెందిన మీర్‌వాయిజ్ ఉమర్ ఫారూక్, తలపండిన దౌత్యవేత్త జి. పార్థసారథి మరియు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ దృష్టికోణాన్ని వివరించే శ్రీ నరేంద్ర మోదీ లు. హురియత్ దృష్టికోణాన్ని శ్రీ మోదీ సవాలు చేసిన తీరులోని స్పష్టత ప్రశంసా యోగ్యంగా ఉండింది. ఆ ఎపిసోడ్ కు నాకు పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. ఇటీవలే నేను ముంబయి నుండి ఢిల్లీకి విమానంలో వస్తూ ఉండగా, శ్రీ పార్థసారధి మరియు నేను ఆ ఎపిసోడ్‌ను తలచుకొన్నాము. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల మీద శ్రీ మోదీకి ఉన్నటువంటి పట్టుకు ఆ ఎపిసోడ్ ఎలా అద్దం పట్టిందో మేము మాట్లాడుకున్నాము. ”