మీ నాయకత్వానికి నేను మీకు (ప్రధాని మోదీకి) అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. వాణిజ్య శాఖ మంత్రి హోదాలో నేను చివరిసారిగా 2013లో భారతదేశాన్ని సందర్శించాను; అప్పటితో పోలిస్తే న్యూఢిల్లీ వీధుల్లో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు స్పష్టంగా తెలుస్తోంది, అలాగే మరో రెండు రోజుల్లో ముంబైలో కూడా ఇలాంటి మార్పులనే నేను ఎక్కువగా చూస్తానని భావిస్తున్నాను. మనం కళ్లారా చూస్తున్నది ఒక ఆర్థిక అద్భుతం.