గురుదేవ్ శ్రీ ‌శ్రీ ర‌వి శంక‌ర్
“ భార‌తదేశం సొత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని ప్ర‌ధాని శ్రీ మోదీ వాంఛిస్తారు. ఆత్మ‌నిర్భ‌ర్త ను (స్వ‌యం స‌మృద్ధి) ఆయ‌న విశ్వ‌సిస్తారు. మొహ‌మాటం కోసం ఏదో ఒకే అభిప్రాయానికి బ‌ద్ధుడు కావ‌డాన్ని ఆయ‌న ఇష్ట‌ప‌డ‌రు, అలాంటివి అంగీక‌రించ‌రు. స‌రికొత్త ధోర‌ణుల‌ను అల‌వ‌ర‌చుకోవడం, ఆచ‌రించ‌డంలో మోదీ గారు అమిత వేగం ప్ర‌ద‌ర్శిస్తారు. ఇత‌ర సార్వ‌భౌమ దేశాల‌తో భార‌తదేశ ద్వైపాక్షిక సంబంధాల‌కు ఆయ‌న ఒక కొత్త దిశను అందించారు. ఒక ఉద్య‌మ స్ఫూర్తి ఆయ‌న‌లో ఉంది. ఒక అనుభ‌వ‌జ్ఞుడైన పాల‌నాద‌క్షుడుగా అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాలలో ఆయ‌న నిర్మాణాత్మ‌క పాత్రను పోషించి భార‌తదేశ ప్ర‌తిష్ఠ‌ను పెంచారు. నిరుపేద‌లు, కార్పొరేట్ నాయ‌కుల ఆలోచ‌నాధోర‌ణులు రెండింటినీ అర్ధం చేసుకోగ‌ల స‌మ‌ర్థుడు ఆయ‌న‌. ’’