ఆనంద్ జి. మ‌హీంద్రా
“ప్ర‌ధాన మంత్రిగా శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్ద సామాజిక ప్ర‌యోగాలలో ఒక ప్రయోగానికి శ్రీ‌కారం చుట్టారు.  సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించడం, డిజిటైజేష‌న్ ల స‌హ‌కారంతో ‘జెఎఎమ్’ అనే మూడు కార్య‌క్ర‌మాల ద్వారా ఆయ‌న చేప‌ట్టిన ఈ ప్ర‌యోగం ప‌రిధి ఎంతో విస్తృత‌మైన‌టువంటిది.  ఆయన చేపట్టిన అతి పెద్ద విధాన‌ప‌ర‌మైన “స్వ‌చ్ఛ‌త” కార్య‌క్ర‌మం ఇందులో ఒక భాగం.  ఫ‌లితంగా 16 మిలియ‌న్ న‌కిలీ రేష‌న్ కార్డులు, 35 మిలియ‌న్ ఎల్ పిజి క‌నెక్ష‌న్ లను తొల‌గించారు.  సామాజిక మాధ్యమాన్ని వేదిక‌గా చేసుకొని  ఆయ‌న చూపిన విధాన‌ప‌ర‌మైన చొర‌వ స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని విప్ల‌వాత్మ‌కంగా మార్చివేసి స‌మ‌స్య‌ల స‌త్వ‌ర ప‌రిష్కారాన్ని సాధ్య‌ం చేసింది. ”