మీకు 2018 సంవత్సరపు సియోల్ శాంతి బహుమతి ని అందజేస్తున్న సందర్భంగా మిమ్మల్ని నేను అభినందించదలచాను. ఇది భారతదేశ నవ పారిశ్రామికుల ప్రపంచ ప్రతిష్టను పెంపొందించగలుగుతుంది. అంతే కాక, భారతదేశ పరిశ్రమల కు ప్రయోజనకారి కూడా అవుతుంది. స్వచ్ఛ్ భారత్ మిశన్ గాని, లేదా అవినీతి కి ఎదురొడ్డటం గాని లేదా సామాజిక బాధ్యత ను పంచుకోవడం గాని .. ఇటువంటి మంచి ప్రభావాన్ని కనబరచే విధానాల రూపకల్పన లో మన ప్రియతమ ప్రధాన మంత్రి ఎప్పటికీ తలమునకలు అవుతుంటారన్న సంగతి మనకు తెలుసు.