అసంఖ్యాక భారతీయ అమెరికన్ ల విజయ గాథల స్ఫూర్తే భారతదేశం పై తన విశ్వాసానికి మూలమని ప్రధాన మంత్రి శ్రీ మోదీ చెబుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం, ఆంత్రప్రనర్ షిప్ లో వారు ఎనలేని విజయం సాధించారన్నది ఆయన అభిప్రాయం. ఇదే ఆంత్రప్రనర్ సంబంధ స్ఫూర్తి భారతదేశం లో కూడా విజయవంతంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వంలో కాలయాపనను తొలగించడం, అవినీతిపై ఉక్కుపాదం, యువతకు అవకాశాల పెంపు ల వంటి చర్యలను ప్రధాన మంత్రి తీసుకొన్నారు.