ఇయాన్ బ్రీమర్, ప్రెసిడెంట్, యూరేషియా గ్రూప్
మీకు స్వచ్ఛమైన, దక్షత కలిగిన ప్రధాన మంత్రి ఉన్నారు;  ప్రజలలో ఆయన అమితమైన ఆదరణను పొందారు. ఆయన అచ్చంగా అవినీతిపరుడు కానేకారు.  ఒక బిలియన్ కు పైగా ప్రజలు నివసిస్తున్న దేశంలో సాధారణంగా స్వయంగా తాను ఎలాంటి డబ్బూ తీసుకోకుండా, అదే సమయంలో తన చుట్టూ ఉన్న వారు కూడా డబ్బు తీసుకోకుండా చూస్తున్న ఒక నేత ఎట్టకేలకు తెర మీదకు వచ్చారన్న మాట వాస్తవం.  భారతదేశంలోని సంపదను, వనరులను అవి నిజంగా అవసరమైన ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం మరియు అధికార యంత్రాంగంలోని బహుళ అంచెలను తోసిరాజనడం కోసం యత్నించడం.. ఇవే ఆయన విధానాలలో సర్వ ప్రథమమైన, అత్యంత ప్రధానమైన అంశాలు.  మౌలిక సదుపాయాలను కల్పించడం, జాతీయ స్థాయి వస్తువులు మరియు సేవల పన్నును ప్రవేశపెట్టడం, భారతదేశం తనను తాను మరిన్ని మెట్లు ఎదిగే విధంగా చూసేందుకు వ్యవస్థను సంస్కరించడం.. ఈ పనులు చేయడానికి రాజకీయపరంగా తగినంత శక్తిని ఆయనకు ఇచ్చింది కూడా ఈ విధానాలే.