ఐక్య‌ రాజ్య‌ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాన్ కీ మూన్‌
జల వాయు పరివర్తన సంబంధిత పారిస్ ఒప్పందం లో భాగ‌స్వామి కావ‌డం ద్వారా భార‌త ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ నాయ‌క‌త్వాన్ని, దార్శ‌నిక‌తను చాటింది. ఈ చారిత్ర‌క చ‌ర్య భార‌తదేశాన్ని మ‌రింత సుస్థిర‌మైన వృద్ధి, అభివృద్ధి ల ప‌థంలోకి తీసుకుపోతుంది. భార‌తదేశం ప్ర‌ద‌ర్శించిన వాతావ‌ర‌ణ సంబంధ నాయ‌క‌త్వానికి వారికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. దీనికి ప్ర‌పంచంలో అన్ని ప్రాంతాల నుండి మ‌ద్ద‌తు ల‌భించ‌డం ఈ ఏడాది లోనే ఇది ఆచ‌ర‌ణ‌ లోకి రావ‌డానికి కార‌ణం అవుతుంది. ఈ ఒప్పందాన్ని భార‌తదేశం ధ్రువీక‌రించ‌డం ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ప్ర‌పంచాన్ని మ‌రింత స‌న్నిహితం చేస్తుంది.