“ సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై మీ (ప్రధాన మంత్రి శ్రీ మోదీ) దార్శనికత దేశంలో అద్భుతమైన వృద్ధిసాధనకు కావలసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంబంధ ఆకాంక్షలను రేకెత్తించింది, స్టార్ట్- అప్ విప్లవానికి బాటలు వేసింది. డిజిటల్ అక్షరాస్యతపై మీ కల, ఇంతవరకు నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకువస్తోంది. లక్షలాది మంది మహిళలకు మీరు ఆత్మగౌరవాన్ని, సాధికారితను అందించారు. వారు మన సమాజాన్ని మార్చుతున్నారు. స్వచ్ఛమైన, హరిత భారత్ కోసం మీరు ప్రారంభించిన ఉద్యమం దేశాన్ని సుస్థిర భవిష్యత్తు దిశగా నడిపిస్తుంది. మీరు అనుసరిస్తున్న అంతర్జాతీయ రాజనీతిజ్ఞతకు ధన్యవాదాలు. అంతర్జాతీయ దేశాలన్నింటిలోనూ భారతదేశం తల ఎత్తుకొని నిలబడగలుగుతుంది. ”